సాయి ప‌ల్ల‌వి ఛాన్స్ కొట్టేసిన ర‌ష్మిక‌

sai pallavi the first choice of dear comrade

కేరళ కుట్టీ సాయి ప‌ల్ల‌వి ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ చిత్రంకి సంబంధించిన కొన్ని జ్ఞాప‌కాల నుండి అభిమానులు ఇంకా బ‌య‌ట‌ప‌డ‌లేద‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌రి తన న‌ట‌న‌తో అంత‌లా ఆక‌ట్టుకుంది సాయిప‌ల్ల‌వి. ప్ర‌స్తుతం ప‌లు త‌మిళ‌, తెలుగు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సాయి ప‌ల్ల‌వికి డియ‌ర్ కామ్రేడ్ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ వ‌చ్చింద‌ట‌. చిత్ర బృందం ముందుగా సాయి ప‌ల్ల‌విని సంప్ర‌దించి స్టోరీ కూడా వినిపించార‌ట‌. క‌థ‌, క‌థ‌నం అంతా న‌చ్చిన లిప్ లాక్ సీన్స్ గురించి చెప్పేస‌రికి ఈ ప్రాజెక్ట్‌లో త‌ను భాగం కాలేన‌ని వెల్లడించింద‌ట‌. దీంతో మేక‌ర్స్ ర‌ష్మిక మంథానని ఎంపిక చేశారు. ఇప్ప‌టికే డియ‌ర్ కామ్రేడ్ చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కాగా ఇందులో విజ‌య్‌, ర‌ష్మిక‌ల మ‌ధ్య లిప్ లాక్ సీన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో మ‌నందరం చూశాం. అయితే కోపం, బాధ‌, త‌ర‌హాలోనే ముద్దు కూడా ఓ ఎమోష‌నే అని ర‌ష్మిక పేర్కొంది. న‌టిగా దాన్ని కూడా పండించాలి. ముద్దు స‌న్నివేశాల‌ని న‌ట‌న నుండి వేరుగా చూడ‌లేమంటూ వెల్ల‌డించింది రష్మిక‌. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం జూలై 26న విడుద‌ల కానుంది. ఇక సాయి ప‌ల్ల‌వి రానా ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న విరాట ప‌ర్వంలో న‌టిస్తుంది.