తండేల్ సినిమా ఓవర్సీస్ రైట్స్ ని ఎవరు చేస్తారు?

Who will do the overseas rights of Tandel movie?
Who will do the overseas rights of Tandel movie?

అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పేట్రియాటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా తండేల్. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధం అవుతుంది .n

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోన్న ఈ సినిమా పై అక్కినేని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో మంచి అంచనాలు కూడా ఉన్నాయి.

Who will do the overseas rights of Tandel movie?
Who will do the overseas rights of Tandel movie?

ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ తో అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమా యొక్క ఓవర్సీస్ రైట్స్ ని తాజాగా ప్రముఖ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తప్పకుండా రిలీజ్ అనంతరం తండేల్ సినిమా మంచి విజయం అందుకోవడం ఖాయం అని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది .