రామాయణం: రణబీర్, సాయి పల్లవి తో కొత్త ట్విస్ట్

Ramayanam: A new twist with Ranbir and Sai Pallavi
Ramayanam: A new twist with Ranbir and Sai Pallavi

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా నటించిన రీసెంట్ భారీ హిట్ మూవీ “అనిమల్” (Animal The Film) కోసం అందరికీ తెలిసిందే. మరి అనిమల్ మూవీ తర్వాత రణబీర్ మరిన్ని సాలిడ్ ప్రాజెక్ట్ లు లైన్ లో పెట్టుకోగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి (Nitish Tiwari) కాంబినేషన్ లో చేయనున్న భారీ మూవీ “రామాయణం” కూడా ఒకటి.

మరి ఈ మూవీ లో టాలెంటెడ్, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) సీత పాత్ర చేయనుంది అని ఇది వరకే టాక్ ఉంది. అయితే ఈ మూవీ కోసం మూవీ లవర్స్ లో చాలా ఆసక్తి నెలకొంది. అయితే ఈ మూవీ పై లేటెస్ట్ గా బాలీవుడ్ వర్గాల్లో సరికొత్త ట్విస్ట్ బయటకి వచ్చింది. ఈ మూవీ ఇంకా అధికారికంగా కూడా అనౌన్స్ కాలేదు కానీ క్యాస్టింగ్ పరంగా సాలిడ్ బజ్ ఉంది.

Ramayanam: A new twist with Ranbir and Sai Pallavi
Ramayanam: A new twist with Ranbir and Sai Pallavi

వీటితో ఈ మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని వేచి చూస్తున్న వారు కూడా ఎక్కువ మందే ఉన్నారు. అయితే ఈ మూవీ స్టార్ట్ అవ్వడానికి ఇప్పుడు ఇంకా ఎక్కువ సమయం పడుతుందట. అంతర్గతంగా ఉన్న కొన్ని కారణాలు రీత్యా ఈ మూవీ ఈ ఏడాదిలో కూడా స్టార్ట్ కాకపోవచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే ఈ అవైటెడ్ మూవీ మరింత ఆలస్యం అవుతుందని చెప్పాలి.