“తండేల్ “మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా..?

Do you know the release date of
Do you know the release date of "Tandel" movie?

అక్కినేని వారి యంగ్ అండ్ ఫైనెస్ట్ హీరో నాగ చైతన్య హీరోగా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు చందూ మోడిటీ కాంబినేషన్ లో చేస్తున్న భారీ మూవీ “తండేల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ అవుతుండగా మరో పక్క రిలీజ్ కోసం కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఫైనల్ గా ఈ రిలీజ్ డేట్ పై స్ట్రాంగ్ బజ్ బయటకి వచ్చింది.

Do you know the release date of "Tandel" movie?
Do you know the release date of “Tandel” movie?

ఇది వరకు ఈ మూవీ అక్టోబర్ లో వస్తుంది అని వినిపించింది. కానీ సినీ వర్గాల లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ మూవీ ఈ ఏడాది డిసెంబర్ 20న రిలీజ్ కు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ డేట్ పై అధికారిక క్లారిటీ కూడా అతి త్వరలోనే రానున్నట్టుగా సమాచారం. ఇక ఈ మూవీ కి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ వారు భారీ వ్యయంతో ఈ మూవీ ని నిర్మాణం వహిస్తున్నారు.