జియో వాళ్ళది కిల్లర్ OTT ప్లాన్: పోటీదారులకు గట్టి షాక్!

Jio's killer OTT plan: A shock to competitors!
Jio's killer OTT plan: A shock to competitors!

ప్రస్తుత టెక్నాలజీ టెలికాం రంగంలో ప్రముఖ సంస్థ రిలయన్స్ జియో తమ నెట్వర్క్ తో ఒక్కసారిగా ఎలాంటి రివల్యూషన్ తెచ్చిందో అందరికి తెలిసిందే. అక్కడ నుంచి మొబైల్ రీఛార్జ్ ప్లాన్ లు అన్నీ చాలా మారిపోయాయి . మరి అతి తక్కువ ధరకు ఇంటర్నెట్ ని అందరికీ అందుబాటులోకి వారు తీసుకురాగా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ తెచ్చుకుంటున్న ఓటిటి రంగంలోకి కూడా అడుగు పెట్టేసారు . .

Jio's killer OTT plan: A shock to competitors!

Jio’s killer OTT plan: A shock to competitors!

అలా అనేక ఎంటర్టైన్మెంట్ సంబంధించి సంస్థలతో కలిసి జియో సినిమా’ యాప్ ద్వారా రూ. 99 కు నెల, రూ. 999 కు ఏడాది ప్లాన్ లను తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఇండియాలో బాగా పాతుకుపోయిన నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో లాంటి వాటిని ఎక్కువగా వాడే వారు దీనిపై మరీ అంత ఆసక్తి కనబరచలేదు. కానీ లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన ధరలు చూసి మరోసారి నేషనల్ వైడ్ గా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు .

కేవలం అంటే కేవలం 29 రూపాయలకే ప్రీమియం మెంబర్షిప్ ను ఇప్పుడు జియో సినిమా వారు తీసుకొచ్చారు. దీనితో ఇది ప్రపంచంలోనే అతి తక్కువ ధరగా తెలుస్తోంది . అనేక స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లలో యావరేజ్ గా చూసుకున్నా సుమారు 30 నుంచి 40 రూపాయలు అలా నెలకు ప్లాన్ లు ఉన్నాయి. పైగా వాటిలో ప్రకటనలు కూడా ఉంటాయి వీడియో క్వాలిటీ కూడా ఇంతే అని కొన్ని ఉంటాయి.

కానీ జియో సినిమాలో అలా కాదు ఎలాంటి ప్రకటనలు లేకుండా 4K క్వాలిటీతో ఒక్క యూజర్ స్ట్రీమ్ చేయవచ్చు. మొత్తానికి అయితే ఈ ప్లాన్ విషయంలో మాత్రం మరోసారి జియో వారు తమ స్ట్రాటజీ ని ప్రూవ్ చేసుకున్నారు. ఇక ఇపుడు ఏడాది ప్లాన్ తీసేసి 89 రూపాయలకు నలుగురు వినియోగించే విధంగా తీసుకొచ్చారు. మరి వీటికి ఇప్పుడు మంచి స్పందన మొదలైంది. ఇక భవిష్యత్తులో ఎలా ఉంటుందో అనేది చూడాలి.