రణబీర్, సాయి పల్లవి “రామాయణం” అనౌన్సమెంట్ కి స్పెషల్ డేట్ ఫిక్స్ ..!

Special day fix for Ranbir and Sai Pallavi
Special day fix for Ranbir and Sai Pallavi "Ramayanam" announcement ..!

మన పురాణాల్లో ఉన్న ఎన్నో మహోత్తర అంశాలు కూడా ఉన్నాయి. భావితరాలకు మనుగడని నేర్పిన ఈ అంశాలు అధ్యాయాల్లో త్రేతా యుగంలో జరిగిన “రామాయణం” కూడా ఒకటి. మరి ఈ రామాయణంపై ఇప్పుడు వరకు ఇండియన్ మూవీ దగ్గర వచ్చిన సినిమా లు కానీ సీరియళ్లు కానీ కోకొల్లలు. అయినా కూడా మళ్ళీ మళ్ళీ ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు.

అయితే బాలీవుడ్ నుంచి రీసెంట్ గానే “ఆదిపురుష్” అనే మూవీ వచ్చింది. కానీ మూవీ లో కల్పితం ఎక్కువ కావడం విజువల్స్ కూడా మెప్పించక పోవడం తో ప్రేక్షకులకి అంతగా రుచించలేదు. కానీ ఈ మూవీ తర్వాత ఇదే బాలీవుడ్ నుంచి మరో రామాయణం “దంగల్” చిత్ర దర్శకుడు నితీష్ తివారి ఎప్పుడు నుంచో ప్లానింగ్ చేస్తున్నది ఇప్పుడు సమాయత్తమవుతుంది .

Special day fix for Ranbir and Sai Pallavi "Ramayanam" announcement ..!
Special day fix for Ranbir and Sai Pallavi “Ramayanam” announcement ..!

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి శ్రీరాముడు, సీతగా రాకింగ్ స్టార్ యష్ రావణ పాత్రలో ప్లాన్ చేస్తున్న ఈ మూవీ పై మంచి బజ్ ఉంది. మరి ఈ మూవీ అయితే ఎప్పుడు అనౌన్స్ కానుందో ఇప్పుడు టాక్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ మూవీ ఈ ఏడాది ఏప్రిల్ 17 శ్రీరామ నవమి సందర్భంగా అయితే అనౌన్స్ చేస్తున్నట్టుగా టాక్. దీనితో ఈ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఏంటో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ మూవీ లో మరింతమంది బాలీవుడ్ స్టార్స్ కనిపించనున్నారు.