సరిలేరు నీకెవ్వరు నుండి సైడ్ తీసుకున్న జ‌గ‌ప‌తి బాబు!

jagapathibabu out from sarileru neekevvaru

మ‌హ‌ర్షి చిత్రం త‌ర్వాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు. ప్ర‌స్తుతం ఈ చిత్రం క‌శ్మీర్‌లో షూటింగ్ జ‌రుపుకుంటున్న‌ట్ట స‌మాచారం. భారీ కాస్టింగ్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో జ‌గ‌ప‌తి బాబుని ప్ర‌ధాన పాత్ర‌కి ఎంపిక చేశారు. కాని ప‌లు కార‌ణాల వ‌ల‌న ఆయ‌న ఈ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్న‌ట్టు స‌మాచారం. జ‌గ‌ప‌తి బాబు స్థానంలో ప్ర‌కాశ్ రాజ్‌ని సెల‌క్ట్ చేసిన‌ట్టు తెలుస్తుంది. మ‌రి జ‌గ‌ప‌తి బాబుకి చిత్ర బృందంతో ప‌డ‌క త‌ప్ప‌కున్నాడా,లేక మ‌రేదైన కార‌ణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నారు.చాలా ఏళ్ళ త‌ర్వాత విజ‌యశాంతి ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తుంది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మ‌హేష్ ఆర్మీ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు.