బాబోయ్‌ అనిపించేందుకు నమిత రెడీ

T Rajendar Next Film With Namitha

తెలుగు ప్రేక్షకులను ‘సొంతం’తో పలకరించిన ముద్దుగుమ్మ నమిత ఆ తర్వాత తమిళంలో బాగా ఫేమస్‌ అయ్యింది. తెలుగులో కూడా ఈమె పలు చిత్రాల్లో నటించింది. అయితే లావు ఎక్కువ కావడంతో తెలుగు కంటే తమిళంలోనే ఈమెకు ఎక్కువగా ఆఫర్లు దక్కాయి. ఐటెం సాంగ్స్‌తో పాటు తెలుగులో ప్రత్యేక పాత్రలు చేసిన నమిత తమిళంలో మాత్రం స్టార్‌ హీరోలకు సైతం పోటీనిచ్చే స్థాయిలో చిత్రాలు చేసింది. భారీ చిత్రాల్లో నటించిన నమిత ఈమద్య వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత చాలా నెలలు విరామం తీసుకున్న నమిత తాజాగా ఒక చిత్రాన్ని చేస్తుంది.

తమిళ ప్రముఖ దర్శకుడు టీ రాజేందర్‌ దర్శకత్వంలో నమిత హీరోయిన్‌గా ఒక చిత్రం తెరకెక్కుతుంది. నమిత చిత్రాలు అంటే యూత్‌ ఆడియన్స్‌  టార్గెట్‌గా ఉంటాయనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక టీ రాజేందర్‌ దర్శకత్వంలో ప్రస్తుతం నమిత హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం పూర్తిగా యూత్‌ ఆడియన్స్‌ టార్గెట్‌గా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. లేడీ డాన్‌గా నమిత కనిపించబోతుంది. నమిత భారీ ఫైట్స్‌ చేయడంతో పాటు హద్దులు మీరి అందాల ప్రదర్శణ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. పెళ్లి తర్వాత నమిత ఇంకాస్త బరువు పెరిగింది. ఇప్పటికే భారీ ఖాయంతో ఉన్న నమిత అందాల ప్రదర్శణ చేస్తానంటే తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించరు. కాని తమిళ ఆడియన్స్‌కు మాత్రం బొద్దుగుమ్మలు అంటేనే ఇష్టం. అందుకే ఈ చిత్రంతో నమిత బాబోయ్‌ అనిపించడం ఖాయం అన్నట్లుగా తెలుస్తోంది. నమితకు తెలుగులో కూడా మంచి క్రేజ్‌ ఉంది కనుక ఆ చిత్రం తెలుగులో కూడా డబ్‌ కాబోతుంది. ఈ చిత్రం సక్సెస్‌ అయితే నమిత వరుసగా చిత్రాలు చేసే అవకాశం ఉంది.