పేరులోనే అంతా ఉందా?? ఇది నిజమా??

Does Your Name is Determine Your life

అమర్, చిరంజీవి పేరున్న వాళ్ళు పూర్ణాయుష్యులా?? లక్ష్మీ, సిరి అనే పేరున్న వాళ్ళకు డబ్బుకు కొదవుండదా?? రాముడు అనే పేరు వాళ్ళు ఏకపత్నీ వ్రతులా?? సీత పేరుంటే కష్టాలు తప్పవా??కృష్ణ అనే పేరున్న వాళ్ళు కన్నవాళ్ళకి దూరంగా ఉంటారా?? సుహాసిని అనే పేరు కలిగిన వాళ్ళ నవ్వు బాగుంటుందా?? కరుణ అనే పేరున్న వాళ్ళు నిజంగా అమృతమూర్తులా?? సౌమ్య అనే పేరగల వాళ్ళు సౌమ్యులా??వాణి , సరస్వతి అని పేరున్న వాళ్ళు చదువుల తల్లులా?? శ్రావ్య అని పేరున్న వాళ్ళ స్వరం శ్రావ్యంగా ఉంటుందా?? శ్వేత అని పేరున్న వాళ్ళు తెల్లగా ఉంటారా??
పేరు మార్చుకుంటేనో , పేరులో అక్షరాలు మార్చుకుంటేనో జీవితం నిజంగా మారిపోతుందా??

archana movies

పవన్ కళ్యాణ్, ఆర్యన్ రాజేష్, ఆశాషైనీ‌‌, నమిత (బైరవి), ఇలా ప్రముఖులు చాలా మందే పేర్లు మార్చుకున్నారు… కళ్యాణ్ నుండి పవన్ కళ్యాణ్ అయ్యాక కూడా నాలుగు ఫ్లాప్ లు ఉంటే ఒక హిట్టు అన్నట్లుగా సాగుతోంది… పేరు మార్చుకున్న ఆర్యన్ రాజేష్ అడ్రస్ లేకుండా పోయాడు.. మయూరిగా మారిన ఆశాషైనీ‌‌ ని అవకాశాలు ఆమడ దూరం పోయాయి..నిజంగా తెలివితేటలు , శ్రమ లేకుండా పేరు మార్చుకుంటే ప్రయోజనం ఉంటుందా ?? అది వారిని అందలం ఎక్కిస్తుందా??ఒక సచిన్, అబ్దుల్ కలాం, కమల్ హసన్, మైకేల్ జాక్సన్, మిథాలీ రాజ్, సానియా మీర్జా ,సత్యనాదెల్ల, సుందర్ పిచాయ్, జుకర్ బర్గ్ లాంటి వాళ్ళంతా వీళ్ళ పేరు వలననో , పేరులోని అక్షరాల మార్పు వల్లనో గొప్పవాళ్ళయ్యారా??పేరులో మార్పులను సజెస్ట్ చేశేవారికి నాదొక సందేహం?? ఇంగ్లీష్ లో కాకుండా ఇతర ప్రాంతీయ భాషలలో పేరు రాసుకుంటే ఎలాంటి మార్పులను సూచిస్తారు.?? లేదు ఇంగ్లీష్ లోనే పేరు మార్చుకోవాలంటే ఆ పేరును ( మీరు సజెస్ట్) ఎలా పలకాలి?? ఇదివరకు లాగానే పిలిస్తే మీరు సూచించిన వైబ్రేషన్ ఉండదు కదా?? అలా కాకుండా మీరు సూచించిన పేరును తడుముకోకుండా మీరైనా పదిసార్లు పలుకగలరా??