అరవింద ఆడియో వేడుక.. గందరగోళ చర్చ

aravinda sametha movie audio release date fixed

ఎన్టీఆర్‌, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘అరవింద సమేత’. ఈ చిత్రంలో నాగబాబు, జగపతిబాబుతో పాటు ఇంకా పలువురు ప్రముఖ నటీనటులు నటించారు. దాంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దసరా కానుకగా ఈ చిత్రంను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. షూటింగ్‌ను చివరి దశలో చాలా స్పీడ్‌గా చేస్తున్నారు. తండ్రి చనిపోయినా కూడా ఎన్టీఆర్‌ మూడవ రోజు నుండే చిత్రీకరణలో పాల్గొంటూ సినిమా విడుదలకు ఎలాంటి సమస్య రాకుండా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం ఆడియో విడుదల తేదీని తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. ఈనెల 20న ఆడియోను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో సోషల్‌ మీడియాలో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

balakrishna and ntr and kalyanram

‘అరవింద సమేత’ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు అని, చాలా కాలం తర్వాత నందమూరి హీరోలు ఎన్టీఆర్‌, బాలకృష్ణ, కళ్యాణ్‌ రామ్‌లను ఒకే స్టేజ్‌పై చూడబోతున్నాం అంటూ నందమూరి ఫ్యాన్స్‌ ప్రచారం చేస్తున్నారు. హరికష్ణ మరణంతో కలిసిన నందమూరి ఫ్యామిలీ అరవింద సమేత చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో కనిపించి అభిమానలను అలరించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మరో వైపు నందమూరి వారి ఇంట జరిగిన విషాదం కారణంగా అరవింద సమేత ఆడియో వేడుక జరపకుండా నేరుగా ఈనెల 20న మార్కెట్‌లోకి పాటలను విడుదల చేస్తారు అంటూ ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఎవరికి తోచిన విధంగా వారు ఊహించేసుకుంటున్నారు. దాంతో అభిమానుల్లో ఏది నిజం ఏది అబద్దం అనే చర్చ జరుగుతుంది. ఈ గందరగోళ చర్చకు చిత్ర యూనిట్‌ సభ్యులు ఫుల్‌స్టాప్‌ పెట్టాని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.