అబ్బాయిలను ఫుల్‌ జోష్‌ చేసిన బాబాయ్‌…!

Balakrishna Chief Guest For Aravinda Sametha Success Meet

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌ల కాంభోలో తెరకెక్కిన ‘అరవింద సమేత’ చిత్రం తాజాగా విడుదలై మంచి సక్సెస్‌ను సాధించింది. ఫుల్‌ యాక్షన్‌ చిత్రంగా రూపొందినా కూడా మంచి కలెక్షన్లను రాబడుతోంది. తాజాగా ఈ చిత్ర సక్సెస్‌ మీట్‌ హైద్రాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్‌ బాబాయ్‌ బాలకృష్ణ హాజరయ్యారు. ఎన్టీఆర్‌ అన్నయ్య కళ్యాణ్‌ రామ్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కళ్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ… సీమ యాసలో మాట్లాడి తమ్ముడు చాలా అద్భుతంగా నటించాడు అంటూ ఎన్టీఆర్‌ను పొగిడేశాడు. ఇకపోతే ఆయన ప్రతినాయకుడు కాదు మా కుటుంబానికి మంచి మిత్రుడు, బసిరెడ్డి పాత్రలో ఆయన్ను తప్ప ఎవరిని ఊహించుకోలేం అంటూ జగపతి బాబును అభినందించాడు.

balakrishna-ntr

ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారు. దర్శకుడు త్రివిక్రమ్‌ ఫుల్‌టైం యాక్షన్‌ చిత్రాన్ని చాలా చక్కగా రూపొందించారు. ఈ సమయంలో నాన్న ఉంటే బావుండేది, నాన్న లేకున్నా ఆ స్థానంలోకి బాబాయి వచ్చి ఆ లోటును తీర్చేశాడు. ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో రాత్రిపగళ్లు బిజీగా ఉన్న బాబాయి ఈ కార్యక్రమానికి హాజరవడం చాలా సంతోషంగా ఉంది అంటూ కళ్యాణ్‌రామ్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. మొత్తానికి బాలయ్యబాబు ఈ కార్యక్రమానికి హాజరవడం వల్ల అబ్బాయులు చాలా జోష్‌ ఫీల్‌ అవుతున్నారు.

Aravinda Sametha 5 Days Box Office Collections Report