విషాద ఛాయల నుండి వెలుగు చూపించాడు…!

Nandamuri Balakrishna Superb Speech At Aravinda Sametha Movie

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత’ చిత్రంలో నటిస్తుండగా తండ్రి హరికిష్ణ్ర రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెల్సిందే. అప్పటి నుండి నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ చిత్ర ప్రీ ఈవెంట్‌లో కూడా ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ కన్నీరు మున్నీరు అయ్యారు. అది చూసిన అభిమానుల హృదయాలు ద్రవించిపోయాయి. తాజాగా ఈ చిత్ర సక్సెస్‌ మీట్‌ హైద్రాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎన్టీఆర్‌ ఒక కొత్త ప్రయత్నానికి నాంది పలికిన ఆప్త మిత్రుడు త్రివిక్రమ్‌కు ధన్యవాదాలు తెలియజేశాడు. ఈ విజయ దశమికి విషాదంలో ఉన్న మా కుటుంబానికి ఈ చిత్రం ద్వారా వెలుగు చూపించాడు అంటూ ఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు.

Balakrishna Chief Guest For Aravinda Sametha Success Meet

అన్నయ్య ఈ సమయంలో నాన్న ఉంటే బావుండేది అని అన్నారు కానీ నాన్న ఇక్కడే ఎక్కడో తిష్ఠ వేసుకుని కూచోని ఇదంతా చూస్తూ ఉంటాడు. నాన్న స్థానంలో వచ్చిన బాబాయికి పాదాభివందనాలు. ఈ చిత్రంలో నటించిన ప్రతీ ఒక్కరు చాలా బాగా నటించారు. ఈ చిత్రం కోసం పని చేసి చేసిన సాంకేతిక నిపుణులందరికి కృతజ్ఞతలు తెలియజేశాడు. చివరగా జై ఎన్టీఆర్‌, జై హరిక్రిష్ణ అంటూ ఎన్టీఆర్‌ ముగించాడు. తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్న ఎన్టీఆర్‌కు ‘అరవింద సమేత’ చిత్రం కాస్తంతా బూస్ట్‌ ఇచ్చిందని అభిమానులు ఆనందపడుతున్నారు.

jagapathibabu