మంచు మనోజ్ లేఖ దానికే సంకేతమా…మరి ఏ పార్టీ…!

Manchu Manoj Decided To Shift To Tirupati To Help Farmers

రాయలసీమ వస్తున్నా మటన్ పులుసుతో రెడీగా ఉండండి అంటూ మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా లేఖను పంచుకున్నాడు. తాను కొత్త జర్నీ ప్రారంభిస్తున్నానని దానికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని ఆయన కోరటం ప్రేక్షకుల్లో పలు ఆలోచనలు రేకెత్తిస్తోంది. సేవా కార్యక్రమాల కోసం తిరుపతికి షిఫ్ట్ అవుతున్నట్లు మనోజ్ ప్రకటించారు. తిరుపతిలో రైతుల పిల్లలకు విద్యను అందించడంతో పాటు యువతకు తన వంతు సాయం చేస్తానని తెలిపారు. రానున్న రోజుల్లో తన సేవా కార్యక్రమాలను ఏపీలోని ఇతర ప్రాంతాలతో పాటు తెలంగాణకూ విస్తరిస్తానని మనోజ్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్‌లో ‘మీ కోసం నేను’ అంటూ.. ఓ లేఖను పోస్ట్ చేశారు.

manchu
తిరుపతి నేను పెరిగిన ప్రదేశం. నేను కోరుకునే మనశ్శాంతి అక్కడే దొరుకుతుంది. తిరుపతి గాలి తగిలినప్పుడు ఏదో శక్తి ఆవహిస్తుంది. ఇక్కడి రైతుల పిల్లలకు విద్య అందేలా ప్రయత్నం చేస్తా. యువతకు నా వంతు సాయం చేస్తా. నా జీవితాన్ని ఈ నేల యువతకు అంకితం చేస్తున్నా. నా వల్ల లోకానికి కలిగే ప్రయోజనమేంటో వెతికే క్రమంలో కొన్ని నెలల పాటు తిరుపతికి షిఫ్ట్ అవుతున్నా. రాయలసీమ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రయాణాన్ని కోస్తా, తెలంగాణలకూ కొనసాగిస్తా. నా సినీ, రాజకీయ జీవితం ఎలాంటి తీర్మానాలు చేయవద్దు. సినిమాలపై నాకున్న ఆసక్తి ఎప్పుడూ తగ్గదు అని ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
తాను సినిమాలకు చేయబోనని గతంలోనూ ఓసారి మనోజ్ ప్రకటించారు అభిమానుల కోరిక మేరకు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. తాజాగా మళ్లీ అలాంటి ప్రకటనే చేయడంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

farmers

అయితే తన సినిమా కెరీర్, రాజకీయ కెరీర్ పై ఏదేదో ఉహించుకోవద్దని కూడా ఆ లేఖలో పేర్కొన్నాడు. వెండితెరపై డిఫెరెంట్ రోల్స్‌లో ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటానని, సినిమా కెరీర్‌కి ఫుల్‌స్టాప్ పెట్టేదే లేదని స్పష్టం చేశాడు. కానీ రాజకీయం గురించి ఆయన క్లారిటీ ఇవ్వకపోవడమే ఇప్పుడు పలు అనుమానాలకి తావిస్తోంది. ఇదంతా చూస్తుంటే మ‌నోజ్ త్వ‌ర‌లోనే ఏదో ఓ జెండా ప‌ట్టుకోవ‌డం ఖాయంగా అనిపిస్తోంది. మంచు కుటుంబానికి ఏపీలో ఒక ప్రధాన పార్టీ అధినేతతో దగ్గరి బంధుత్వం ఉంది. అలాగే ఆయనకు తెలుగుదేశం ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. అదీ కాక కొన్నాళ్ల నుంచీ ఆ కుటుంబం బీజేపీకి టచ్‌లో ఉంటోంది. మోడీ ప్ర‌ధాని అయిన వెంటనే ఆయ‌న్ని క‌లిసి వ‌చ్చారు కూడా సో ఈ మూడు పార్టీలలో ఎదో ఒక జండా పట్టుకుంటాడో లేక కొత్త జండా పట్టుకుంటాడో అనేది వేచి చూడాల్సిన విషయం.