అరవింద కలెక్షన్స్‌ ఫేక్‌ అంటున్నారు…!

Aravinda Sametha Fake Milestone

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. తాజాగా ఈ చిత్రం 100 కోట్ల షేర్‌ను దక్కించుకుంది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేశారు. ఎన్టీఆర్‌ కెరీర్‌లో 100 కోట్ల సినిమా అంటూ నందమూరి ఫ్యాన్స్‌ చంకలు గుద్దుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సినీ విశ్లేషకులు మరియు ట్రేడ్‌ పండితులు అరవింద సమేత ఇంకా 100 కోట్లకు చేరలేదని, 90 కోట్ల వద్దే ఉందని, వంద కోట్లు చేరడం అసాధ్యం అంటూ తేల్చి చెప్పారు.

ntr-aravindha-sametha

ఒకటి రెండు ఏరియాల్లో మినహా ఇతర ఏరియాల్లో ఈ చిత్రంకు ఇంకా బ్రేక్‌ ఈవెన్‌ కూడా దక్కక డిస్ట్రిబ్యూటర్లు నష్టాల్లో ఉన్నారు. దాదాపు 95 కోట్ల బిజినెస్‌ చేసిన ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు పది కోట్ల మేరకు నష్టాలను మిగిల్చే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు. ఇలాంటి సమయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు పబ్లిసిటీ కోసం అంటూ ఇలా ఫేక్‌ కలెక్షన్స్‌ను ప్రకటిస్తున్నారు అంటూ ట్రేడ్‌ పండితులు అంటున్నారు. ఈ విషయమై చిత్ర యూనిట్‌ సభ్యులు ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి. ఈ వార్తలు నందమూరి అభిమానుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Aravinda Sametha 5 Days Box Office Collections Report