ఆరెస్సెస్ ని నిషేదించిన సర్దార్ ను మోడీ మోసేది అందుకేనా ?

Modi Praising Sardar without knowing History

‘భారత్‌కు ఇంకా అధికారికంగా స్వాతంత్య్రం రాకముందు అంటే, 1946లో నాయకత్వ బాధ్యతలు స్వీకరించేందుకు పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ ముందుకు రాగా, 16 మంది ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుల్లో ఒక్కరు మాత్రమే ఆయనకు అనుకూలంగా ఓటేశారు. మిగతా 15 మంది సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌కు ఓటేశారు. పోటీ నుంచి తప్పుకోవాలంటూ జాతిపిత మహాత్మా గాంధీ చేసిన విజ్ఞప్తి మేరకు పటేల్‌ తప్పుకున్నారు. పదవి పండిట్‌ను వరించింది’ ఇంటర్నెట్‌లో బాగా ప్రచారంలో ఉన్న కథ ఇది. ఈ కథను మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా నమ్మారు. సర్దార్‌ పటేల్‌ దేశానికి తొలి ప్రధాన మంత్రి కావాల్సిన వారని, అందుకు ఆయన్ని అడ్డుకున్నారని, లేకపోతే పటేల్, నెహ్రూకన్నా సమర్థుడైన ప్రధాని అయ్యేవారని మోదీ కూడా వ్యాఖ్యలు చేశారు. గతేడాది పటేల్‌ వర్ధంతి సందర్భంగానే కాకుండా ఈ అక్టోబర్‌ 31వ తేదీన జరిగిన జయంతి సందర్భంగా కూడా ఆయన ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మోదీ చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే మన ప్రధాన మంత్రిగా ఆయన్ని దేశ ప్రజలు కాకుండా రాష్ట్ర బీజేపీ శాఖలన్నీ కలిసి ఎన్నుకున్నట్లుగా ఉంది. అసలు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు కలిసి దేశ ప్రధానిని ఎన్నుకోవడం ఏమిటీ? ఇంకా కావాలనుకుంటే పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవచ్చు. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తిని ప్రధాన మంత్రి అభ్యర్థిగా రంగంలోకి దించవచ్చు. అలా అనుకున్నాగానీ నాడు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిని అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ ప్రతినిధులే ఎన్నుకునేవారు. నెహ్రూ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అంతకన్నా కాదు. అప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడిగా జీబీ కృపలాని ఎన్నికయ్యారు. మరి 1946లో జరిగిందేమిటీ అనేది లోతుగా పరిశీలిస్తే ?

sardar patel And nehru

గాంధీ తర్వాత అంతటి ప్రజాదరణ కలిగిన పండిట్‌ నెహ్రూ నాయకత్వాన అప్పటి బ్రిటిష్‌ వైస్రాయ్‌ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1947, ఆగస్టు 15 వ తేదీన దేశ ప్రధాన మంత్రిగా నెహ్రూ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. నాడు పటేల్‌ కన్నా నెహ్రూకే ఎక్కువ ప్రజాదరణ ఉందనడానికి పటేల్‌ అమెరికా జర్నలిస్ట్‌ విన్సెంట్‌ షీన్‌తో చేసిన వ్యాఖ్యలే సాక్ష్యం. ముంబైలో జరిగిన కాంగ్రెస్‌ మహా సమ్మేళనానికి లక్షలాది మంది ప్రజలు హాజరుకావడాన్ని అమెరికా జర్నలిస్ట్‌ ప్రశ్నించినప్పుడు ‘వీరంతా నా కోసం రాలేదు. నేను మాస్‌ లీడర్‌ను కాను. నెహ్రూగారి కోసం వచ్చారు’ అని వ్యాఖ్యానించారు. ‘నాడు వాస్తవ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉక్కులాంటి బలమైన సంకల్పం కలిగిన సర్దార్‌ పటేల్‌ లాంటి వ్యక్తులు ఆరోజుల్లో మాకుండడం మా అదృష్టం’ అని 1966లో ఆరెస్సెస్‌ సుప్రీం ఎంఎస్‌ గోవాల్కర్‌ ‘బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌’ అనే పుస్తకంలో రాశారు. ఆయన ఈ వ్యాక్యం ఏ ఉద్దేశంతో రాశారో తెలియదుగానీ గోవాల్కర్‌ను గురువుగా భావించే నరేంద్ర మోదీ కూడా ఆయన మాటల్ని నమ్మారు. ఆరెస్సెస్‌ సిద్ధాంతం పటేల్‌కు నచ్చిందని భావించి పటేల్‌ భజన ప్రారంభించారు. ఆరెస్సెస్‌ వారిని దారితప్పిన దేశభక్తులుగా భావించిన పటేల్, గాంధీ హత్యకు సరిగ్గా మూడు వారాల ముందే వారిని కాంగ్రెస్‌ పార్టీలోకి కూడా ఆహ్వానించారు.

Modi Speech

అయితే జాతిపిత గాంధీ హత్యానంతరం డిప్యూటి ప్రధాన మంత్రి హోదాలో హోం శాఖను నిర్వహిస్తున్న పటేల్‌ ఆరెస్సెస్‌ నిషేధించారు. ఆరెస్సెస్‌ భావజాలాన్ని వ్యతిరేకిస్తూ 1948, జూలై 18న భవిష్యత్‌ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామప్రసాద ముఖర్జీకి లేఖ కూడా రాశారు. ‘హిందూ మహాసభకు చెందిన తీవ్రభావాజాలం కలిగిన వ్యక్తులే గాంధీ హత్యకు కుట్రదారులని నేను భావిస్తున్నాను. ఆరెస్సెస్‌ కార్యకలాపాలు ప్రభుత్వం, రాజ్యం మనుగడకు ప్రమాదకరంగా తయారయ్యాయి’ అని సర్దార్‌ పటేల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఎప్పటికీ రామన్న హామీపై ఆరెస్సెస్‌పై ఏడాదిన్నర తర్వాత ఆయన నిషేధాన్ని ఎత్తివేశారు. ఏడాది తిరక్కముందే ఆరెస్సెస్‌ ఈ హామీని తుంగలో తొక్కింది. రాజకీయాల్లో పాల్గొనేందుకు జనసంఘ్‌ను తీసుకొచ్చింది. నాటి జనసంఘ్‌యే నేటి బీజేపీ. పటేల్‌ చనిపోయే వరకు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. దేశ విభజనను పండిట్‌ నెహ్రూ కోరుకోవడం వల్లనే పాకిస్థాన్‌ ఏర్పడిందని, అందుకని ఆయన్ని చంపాలనుకున్న నాథూరామ్‌ గాడ్సే ఆయనకు బదులుగా గాంధీని హత్య చేశారంటూ కేరళ ఆరెస్సెస్‌ పత్రిక ఇటీవల సరికొత్త కథనాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. పటేల్‌ దేశ విభజనను వ్యతిరేకించారని కూడా పేర్కొంది. గోవాల్కర్‌ వ్యాఖ్యలను నమ్మినట్లే మన మోదీ కేరళ ఆరెస్సెస్‌ వ్యాఖ్యలను నమ్మారు. ఆయన దేశం ఐక్యత కోసం కషి చేశారంటూ నిన్నటి ప్రసంగానికి మెరుగులు దిద్దారు. 1946, డిసెంబర్‌లోనే పటేల్‌ దేశ విభజనకు అంగీకరించారు. ఆయన వైఖరి పట్ల మొదటి నుంచి దేశ విభజనను వ్యతిరేకించిన అబుల్  కలాం ఆజాద్‌ బాధను వ్యక్తం చేశారు. తాను రాసిన లేఖకు ‘మనం అంగీకరించినా, లేకపోయినా భారత్‌లో రెండు దేశాలు ఉన్నాయి’ అంటూ పటేల్‌ సమాధానం ఇవ్వడం పట్ల ‘ఇండియా విన్స్‌ ఫ్రీడమ్‌’ పేరిట తాను రాసిన జ్ఞాపకాల్లో అబుల్  కలాం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆరు నెలలకు నెహ్రూ దేశ విభజనకు అంగీకరించారు. దాంతో వీపీ మీనన్‌ నాయకత్వాన దేశ విభజన ప్రణాళిక రూపొందింది.

nehru And abdul kalam

అయితే ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఐక్యతా చిహ్నంగా ప్రచారం చేసి సర్దార్ పటేల్ ను బీజేపీకి ఆస్తిగా మార్చుకునేందుకు కట్టిన విగ్రహం కూడా వేగంగానే పూర్తయింది.
ఈ విగ్రహాన్ని నిర్మించాలని గుజరాత్ ముఖ్యమంత్రిగా తను పదేళ్లు పూర్తి చేసినప్పుడే మోడీ నిర్ణయించారు. కానీ అడుగు ముందుకు పడలేదు. 2014లో మోడీ ప్రధాని కావడంతో.. ఆ ప్రాజెక్ట్ దశ మారిపోయింది. జాతీయ ప్రాజెక్టుగా మారిపోయింది. మోడీ ప్రభుత్వ తొలి బడ్జెట్ లోనే దాదాపుగా రూ. 2 వేల కోట్లు కేటాయించారు. సగం గుజరాత్ ప్రభుత్వం మిగతా సగం కేంద్రం ఇస్తోంది. ఆ తర్వాత ప్రాజెక్ట్ పరుగులు తీసింది. ఇప్పుడు ప్రారంభించేస్తున్నారు. నిజానికి దేశంలో మరి ఏ అభివృద్ధి ప్రాజెక్ట్ కూడా ఇంత వేగంగా పూర్తి కాలేదు. అసలు దూరదృష్టితో ప్రారంభించిన ఒక్క ప్రాజెక్ట్ కూడా కనీసం ప్రణాళికల వరకూ కూడా ఇంకా రాలేదు. దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెబుతూ ఉంటారు కానీ అదంతా విగ్రహాల్లోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ విషయంలోనే తీసుకుంటే జాతీయ విద్యాసంస్థలు నెలకొల్పడానికి కేంద్రం ఇస్తున్న నిధులు చూస్తే అసలు 30 ఏళ్లలో కూడా పూర్తి కావు. వందల కోట్లు అవసరమైతే లక్షల్లోనే నిధులు ఇస్తోంది. ప్రధానమంత్రి తనకు రాష్ట్రాల కన్నా విగ్రహాలే ముఖ్యమనుకున్నారు.

PM Modi

ఒక్క ఏపీ అని మాత్రమే కాదు.. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో కనీసం శంకుస్థాపన చేసిన జాతీయ ప్రాజెక్ట్ కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. పోనీ ఈ విగ్రహం వల్ల.. గుజరాత్ ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా అంటే అదీ లేదు. బడుగుల బతుకులను చదును చేసి పడేసి మరీ ఈ విగ్రహాన్ని నిర్మించారు. స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ నిర్మాణంతో సుమారు డెబ్భై గిరిజన గ్రామాలు మునుగుతున్నాయి. వీరందరికీ పునరావాసం కల్పించలేదు. అందిరికీ పునరావాసం పూర్తి చేసిన తర్వాత విగ్రహం ఆవిష్కరిస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ ముంపు గ్రామాల గిరిజనులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. గిరిజనులకు ఇస్తామన్నా ఇళ్లు గానీ, ఉద్యోగాలు గానీ ఇవ్వలేదు. దీంతో ఆ ప్రాంతంలోని గిరిజనులు ఉద్యమాలు చేస్తున్నారు. స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ ఆవిష్కరణకు రావొద్దంటూ 22 గ్రామాల సర్పంచ్‌లు సంతకాలు చేసి మోడీకి పంపారు. ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేసి తమన నిరసనలు తెలియజేస్తున్నారు. బాధితులు ఈ రోజు సంతాప దినాన్ని పాటిస్తున్నారు. అయినా అధికార మదంతో కళ్ళు మూసుకున్న మోడీకి ఇవన్నీ కనపడతాయి అనుకోవడం మన పిచ్చితనమే కదా.