National Politics: ఈశాన్య రాష్ట్రాల్లోని NDA అభ్యర్థులకు మద్దతు తెలిపిన కాన్రాడ్ సంగ్మా పార్టీ

National Politics: Conrad Sangma's party has supported NDA candidates in North Eastern states
National Politics: Conrad Sangma's party has supported NDA candidates in North Eastern states

ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్డీఏ అభ్యర్థులకు తమ పార్టీ మద్దతు మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా ఉంటుందన్నారు . నాగాలాండ్ లోని ఏకైక స్థానం నుంచి ఎన్డీపీపీ అభ్యర్థి చుంబెన్ ముర్రే పోటీ చేయనున్నారు. ఎన్డీఏ కూటమైన ఎన్డీపీ అభ్యర్థి ముర్రీకి తమ నేషనల్ పీపుల్స్ పార్టీ మద్దతు ఉంటుందని సంగ్మా ప్రకటించారు.

నాగాలాండ్ సీఎం, ఎన్డీపీపీ నేత నెయిఫియు రియోతో భేటీ తర్వాత ఈ ప్రకటన చేశారు సంగ్మా. మణిపూర్ నుంచి పోటీ చేస్తున్న ఎన్ పీఎఫ్ అభ్యర్థి కచుయ్ తిమోతీ జిమిక్ కి మద్దతు ప్రకటించారు సంగ్మా. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఎన్ పీఎఫ్ నేత లోర్హో స్థానంలో జిమిక్ పోటీ చేయనున్నారు. మణిపూర్ లోని మరో స్థానానికి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు ఎన్డీఏ. ఇక అరుణాచల్ ప్రదేశ్ లోని రెండు లోక్ సభ స్థానాల నుంచి బీజేపీ తరఫున కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, తపిర్ గావ్ పోటీ చేయనున్నారు. వారికి కూడా మద్దతు తెలిపారు సంగ్మా.