మహేష్‌, సుక్కూలదే ఆలస్యం.. మేము రెడీ…!

NTR Fans Full Serious On Mahesh Babu

‘రంగస్థలం’ వంటి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ తర్వాత సుకుమార్‌ చేయబోతున్న చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇండస్ట్రీ హిట్‌ను దక్కించుకున్న సుకుమార్‌ తర్వాత సినిమా మహేష్‌బాబుతో చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఇప్పటికే సినిమాకు సంబంధించిన కథ సిద్దం అయ్యిందని మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. అయితే తాజాగా నిర్మాతలు ఇంకా కథ సిద్దం కాలేదు అంటూ ప్రకటించారు. మీడియా ముందుకు వచ్చిన మైత్రి మూవీస్‌ మేకర్స్‌ నిర్మాతలు మహేష్‌బాబు, సుకుమార్‌ల కాంబో మూవీని తాము నిర్మించబోతున్నాం. కాని ఇంకా ఆ సినిమాకు సంబంధించిన కథ సిద్దం కాలేదు అంటూ ప్రకటించారు.

maheshbabu

‘రంగస్థలం’ తరహాలోనే ఒక పీరియాడిక్‌ కథను మహేష్‌ బాబు కోసం సుకుమార్‌ రెడీ చేశాడు. మొదట ఆ కథకు మహేష్‌ బాబు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. కాని తెలుగు వరుసగా పీరియాడిక్‌ సినిమాలు వస్తున్న కారణంగా మహేష్‌ బాబు ఆ స్టోరీని రిజెక్ట్‌ చేశాడు. భవిష్యత్తులో ఎప్పుడైన ఆ సినిమాను చేద్దాం. ప్రస్తుతానికి కొత్త కథను సిద్దం చేయండి అంటూ సుకుమార్‌కు మహేష్‌ సూచించాడట. దాంతో ప్రస్తుతం మహేష్‌ బాబు కోసం కథను సిద్దం చేసే పనిలో సుకుమార్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది. వచ్చే వేసవిలో సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు. వచ్చే ఏడాది ప్రారంభించి 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు.

Sukumar-Next-Movie-With-Pra