అరవింద సమేత 5వ పాట విశేషాలు…!

Aravinda Sametha 5 Days Box Office Collections Report

అరవింద సమేత చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ ను దక్కించుకుంది. ఈ చిత్రంలో నాలుగు పాటలు మాత్రమే ఉండటంతో ప్రేక్షకులు నిరుత్సాహంను వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. మరో సాంగ్‌ ఈ చిత్రంలో ఉంది కాని, షూటింగ్‌కు ఆలస్యం అవుతుందని, దసరాకు రిలీజ్‌ చేయాలనే ఉద్దేశ్యంతో ఆ పాటను స్కిప్‌ చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. తమన్‌ కూడా మరోసాంగ్‌ ఈ చిత్రంలో ఉన్న మాట వాస్తవమే అంటూ ప్రకటించాడు. కాని అది ఎందుకు తీసేశారనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా అరవింద సమేత అయిదవ సాంగ్‌ను విడుదల చేశారు.

Aravinda Sametha Pre Release Business

నేటి నుండి సినిమా హాల్‌లో ఈ అయిదవ పాట ప్రదర్శింపబడుతున్నట్లుగా సమాచారం అందుతుంది. అయిదవ పాట ఏదో రొమాంటిక్‌ పాట, లేదంటే మరేదో పాట కాదు. అయిద పాట కమర్షియల్‌ సాంగ్‌ అస్సలే కాదు, ఒక బిట్‌ సాంగ్‌. రెడ్డమ్మ అంటూ సాగే పాట, ఇది సినిమా చివర్లో వస్తుందని సమాచారం అందుతుంది. దీనిని పెంచల్‌ దాస్‌ రాయడంతో పాటు, స్వయంగా పాడాడు. ఆయనకు పాటకు సంబంధించిన పూర్తి క్రెడిట్‌ను ఇస్తూ చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ పాటను సినిమాలో పెట్టినట్లుగా తెలుస్తోంది. అయిదవ పాట కోసం ఎదురు చూసిన వారికి ఇదో బిట్‌ సాంగ్‌ అనగానే కాస్త నిరుత్సాహం తప్పదు. 100 కోట్లను క్రాస్‌ చేసిన ఈ చిత్రం 200 కోట్ల వైపుగా దూసుకు పోతోంది.

Jr NTR Aravinda Sametha Gets U/A Certificate