పిక్‌టాక్‌ : ‘మజిలి’ జంట లుక్‌ అదిరింది…!

Naga Chaitanya Samantha New Movie Majili

నాగచైతన్య మరియు సమంతలు కలిసి ఇప్పటికే మూడు చిత్రాల్లో నటించిన విషయం తెల్సిందే. ఆ చిత్రాల్లో ‘ఏమాయ చేశావే’ మరియు ‘మనం’ చిత్రాలు బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లుగా నిలిచాయి. ‘ఆటోనగర్‌ సూర్య’ మాత్రం అంతగా అలరించలేక పోయింది. పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి నటించబోతున్న మొదటి చిత్రం ‘మజిలి’. ఈ చిత్రంలో నాగచైతన్య మరియు సమంతలు భార్య భర్తలుగా కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే తేలిపోయింది. తాజాగా లీక్‌ అయిన ఈ ఫొటోతో ఆ విషయం క్లారిటీ వచ్చేసింది.

majili

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్న ఈ ఫొటో ‘మజిలి’ చిత్రంకు సంబంధించిన వర్కింగ్‌ స్టిల్స్‌. శివ నిర్వాన దర్శకత్వంలో కోన వెంకట్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌లో ఇటీవలే నాగచైతన్య మరియు సమంత జాయిన్‌ అయ్యారు. అంతకు ముందే కొన్ని కీలక సన్నివేశాలను చైతూ మరియు సామ్‌ లేకుండానే దర్శకుడు పూర్తి చేశాడు. తాజాగా చిత్రం షూటింగ్‌ స్పాట్‌ నుండి ఈ స్టిల్‌ బయటకు వచ్చింది. ఇందులో సమంత కాస్త విభిన్నంగా కనిపిస్తుండగా, నాగచైతన్య మాత్రం రొటీన్‌గా ఉన్నాడు. మొత్తానికి ఇద్దరి జంట కేక అన్నట్లుగా ఉందంటూ సోషల్‌ మీడియాలో టాక్‌ వినిపిస్తుంది.

majili