నాగ చైతన్య “దూత” ట్రైలర్ కి అద్దిరిపోయిన రెస్పాన్స్!

“దూత” ట్రైలర్ కి అద్దిరిపోయిన రెస్పాన్స్!
Cinema News

టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ దూత. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో లో డిసెంబర్ 1, 2023 నుండి స్ట్రీమింగ్ కి సిద్దమైనది . అయితే నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఈ సిరీస్ కు సంబందించిన ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది .

 “దూత” ట్రైలర్ కి అద్దిరిపోయిన రెస్పాన్స్!
Dhootha

ట్రైలర్ యూ ట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. డైరెక్టర్ విక్రమ్ కే. కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ సిరీస్ లో పార్వతి తిరువోతు, ప్రియా భవాని శంకర్ తదితరులు కీలక పాత్రలలో నటించారు. తెలుగు తో పాటుగా, ఇతర భారతీయ ప్రధాన బాషల్లో రిలీజ్ కానున్న ఈ సిరీస్ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.