Election Updates: Breaking: రేపటి BRS ప్రజా ఆశీర్వాద సభ రద్దు?

Election Updates: Breaking: Tomorrow's BRS Praja Ashirwada Sabha cancelled?
Election Updates: Breaking: Tomorrow's BRS Praja Ashirwada Sabha cancelled?

హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో రేపు జరగాల్సిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ వాయిదా పడే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల రాజకీయంతో వేడెక్కిన తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం రెండ్రోజులుగా చల్లబడింది. ఇక గురువారం రోజు ఏకంగా వర్షం కురిసింది. అయితే ఈ వర్షాలు మరో రెండ్రోజులు ఉండనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే 2 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. అటు హైదరాబాద్‌ లో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి.

ఈ తరుణంలోనే వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్​ఎంసీ అప్రమత్తమైంది. వర్షాల వల్ల నగర ప్రజలు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లలో నిమగ్నమైంది. మరోవైపు వైద్యులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, హైదరాబాద్‌ లో రేపు పరేడ్ గ్రౌండ్లో జరగాల్సిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ భారీ వర్షాల నేపథ్యంలో వాయిదా ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది.