శివాజీ: రజినీకాంత్ రీరిలీజ్ డేట్ ఫిక్స్

శివాజీ: రజినీకాంత్ రీరిలీజ్ డేట్ ఫిక్స్
Cinema News

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా శ్రియా శరణ్ హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా శివాజీ ది బాస్. 2007 లో మంచి అంచనాలతో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సొంతం చేసుకున్న ఈ సినిమా లో సుమన్ విలన్ పాత్రలో కనిపించారు.

విషయం ఏమిటంటే, ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం అందరికి తెలిసిందే. అందులో భాగంగా శివాజీ తెలుగు సినిమా ని డిసెంబర్ 12న సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నిజానికి ఈ సినిమా ని డిసెంబర్ 9న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.

శివాజీ: రజినీకాంత్ రీరిలీజ్ డేట్ ఫిక్స్
 Rajinikanth

అయితే కొన్ని కారణాల వలన సినిమా మూడు రోజులు వాయిదా పడింది. ఏవిఎం ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా లో శివాజీ గా రజినీకాంత్ పవర్ఫుల్ యాక్టింగ్, శంకర్ సూపర్ టేకింగ్ తో పాటు ఏ ఆర్ రహమాన్ అందించిన సాంగ్స్, బీజీఎమ్ అదరహో అనిపించాయి. మరి రీ రిలీజ్ లో ఈ సినిమా ఎంతమేర కలెక్షన్ రాబడుతుందో చూడాలి.