Sports: Breaking: ఆస్ట్రేలియా క్రికెటర్ పై FIR నమోదు

Sports: Breaking: FIR registered against Australian cricketer
Sports: Breaking: FIR registered against Australian cricketer

నవంబర్ 19న అహమ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన వన్ డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు ఆతిధ్య భారత్ ను 6 వికెట్ల తేడాతో ఓడించి ఆరవసారి టైటిల్ ను గెలుచుకున్న జట్టుగా అవతరించింది. టైటిల్ గెలిచిన అనంతరం ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ప్రవర్తించిన తీరు పట్ల కోట్లాదిమంది భారత్ అభిమానులు చాలా బాధపడ్డారు. మిచెల్ మార్ష్ గెలిచిన ప్రపంచ కప్ ట్రోఫీ పై కాళ్ళు పెట్టుకుని ఫోటో దిగడంతో అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఈ విషయంపై ఆవేదన చెందిన భారత్ కు చెందిన ఆర్టీఐ కార్యకర్త పండిట్ కేశవ్ ఉత్తరప్రదేశ్ లోని అలీఘడ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. భారత్ అభిమానుల మనోభావాలను దెబ్బతీసాడంటూ పండిట్ కేశవ్ ఈ ఫిర్యాదులో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది.

ఇక ఇదే కంప్లైంట్ కాపీని ప్రధాని నరేంద్ర మోదీకి సైతం పంపించి ఇకపై మార్ష్ భారత్ లో ఆడకుండా నిషేధం విధించాలన్నారు. ఇక వెంటనే ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్ పై అలీఘడ్ పోలీసులు FIR ను నమోదు చేశారు.