Breaking News: సీఎం జగన్, సీబీఐకి సుప్రీం నోటీసులు..!

Election Updates: Birth certificate is now mandatory in AP
Election Updates: Birth certificate is now mandatory in AP

ఏపీ సీఎం జగన్, సీబీఐకి సుప్రీం నోటీసులు పంపింది. ఎంపీ రఘురామకృష్ణ రాజు సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. జగన్ కు బెయిల్ ఇవ్వడాన్ని ED, CBIలు సవాల్ చేయలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో సీబీఐ,జగన్, EDలకు నోటీసులు ఇచ్చిన కోర్టు, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అటు ఈ కేసు విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలన్న మరో పిటిషన్ ను ప్రస్తుతం పిటిషన్ తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. మరి దీనిపై సీఎం జగన్‌ బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.

కాగా, ఆర్థిక నేరాభియోగల కేసులలో 43 వేల కోట్ల రూపాయలు కొట్టేశారని CBI 11 చార్జిషీట్లు దాఖలు చేయగా, కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తి సీఎం పదవికి అర్హుడు కానీ, CBI , CID కేసు విచారణ జరుగుతోందని చెప్పి న్యాయస్థానంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేయడానికి నేను అనర్హుడనని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు మండిపడ్డారు.