“గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి” మళ్ళీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్‌ ఫిక్స్ ?

"Gangs of Godavari" postponed again.. New release date fixed?

టాలీవుడ్ మాస్‌ కా దాస్ విశ్వక్‌సేన్ తాజా మూవీ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ మళ్ళీ వాయిదా ప‌డింది. ఇప్ప‌టికే ఈ మూవీ చాలాసార్లు వాయిదా ప‌డుతూ వ‌స్తున్న విష‌యం అందరికి తెలిసిందే. మొద‌ట ఈ సినిమా ని గ‌తేడాది డిసెంబర్‌ 8న విడుదల చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేశారు. అయితే అనుకోని కార‌ణాల వలన వాయిదా ప‌డింది. అనంత‌రం మార్చి 8న ఈ మూవీ ని రిలీజ్‌ చేయనున్నట్లు ప్ర‌క‌టించారు. అయితే మార్చి నెల‌లో ఈ మూవీ విడుద‌ల‌వ్వ‌లేదు కానీ ‘గామి’ మాత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.రీసెంట్‌గా తెలంగాణ లోక్‌స‌భ ఎన్నిక‌ల అనంత‌రం మే 17న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలియచేసారు .

"Gangs of Godavari" postponed again.. New release date fixed?
“Gangs of Godavari” postponed again.. New release date fixed?

కానీ మ‌ళ్లీ ఈ మూవీ విడుద‌ల తేదీని వాయిదా వేశారు. తాజాగా ఈ మూవీ ని మే 31న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు విశ్వక్‌సేన్ ఎక్స్ వేదిక‌గా ప్ర‌క‌టించాడు. ఫలక్‌నుమా దాస్ విడుద‌లైన మే 31 తేదీనే ఈ మూవీ ను కూడా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపాడు. విశ్వక్‌సేన్ ప్ర‌ధాన‌పాత్ర‌లో వ‌స్తున్న ఈ మూవీ కి ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వం వ‌హిస్తున్నాడు. డీజే టిల్లు ఫేం నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది . ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుద‌ల చేయ‌గా.. ప్రేక్ష‌కుల వ‌ద్ద నుంచి మంచి రెస్పాన్స్ ని ద‌క్కించుకుంది.