అరవిందపై చిట్టిబాబు స్పందన…!

Ram Charan Shocking Comments On Jr Ntr About Aravinda Sametha Movie

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కి దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రంకు హిట్‌ టాక్‌ వచ్చింది. బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకోవడంతో పాటు, భారీ వసూళ్లను రాబడుతున్న ఈ చిత్రంపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అంతా కూడా త్రివిక్రమ్‌ మరియు ఎన్టీఆర్‌లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంను చూసిన రామ్‌ చరణ్‌ కూడా పాజిటివ్‌గా స్పందించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ram-ntr

ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఇదో అద్బుతమైన బెస్ట్‌ నటన, అద్బుతమైన కథ, మరింత అద్బుతమైన దర్శకత్వంతో ఈ సినిమా తెరకెక్కింది. త్రివిక్రమ్‌ గారి డైలాగ్స్‌ సూపర్‌, జగపతిబాబు నటన మరియు తమన్స్‌ సంగీతం చాలా బాగున్నాయి. పూజా హెగ్డే నటన కూడా చాలా బాగుంది అంటూ ఫేస్‌బుక్‌లో రామ్‌ చరణ్‌ స్పందించాడు. అద్బుతమైన ఈ చిత్రం సక్సెస్‌కు చిత్ర యూనిట్‌ సభ్యులకు కంగ్రాట్స్‌ అంటూ చరణ్‌ పోస్ట్‌ చేశాడు. ఈమద్య కాలంలో ఒక స్టార్‌ హీరో సినిమాను మరో స్టార్‌ హీరో మెచ్చుకుంటున్నాడు. ఆ క్రమంలోనే ఈ చిత్రంను ఎన్టీఆర్‌ పొగడ్తలతో చరణ్‌ ముంచెత్తాడు. త్వరలో ఎన్టీఆర్‌ మరియు చరణ్‌లు కలిసి జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఒక మల్టీస్టారర్‌ చేయబోతున్న విషయం తెల్సిందే.

Jr NTR RamCharan Rajamouli RRR Multi Starrer Movies