200 కోట్లు ఖాయమంటున్నారు…!

Jr NTR And Pooja Hegde Film Crosses Bhahubali Movie

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రం మొదటి నాలుగు రోజుల్లోనే 100 కోట్లకు పైగా గ్రాస్‌ను వసూళ్లు చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పటికే నాన్‌ బాహుబలి రికార్డును సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. మొదటి రోజు అత్యధికంగా వసూళ్లు రాబట్టి నాన్‌ బాహుబలి రికార్డు దక్కించుకున్న ఈ చిత్రం త్వరలోనే మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకోబోతున్నట్లుగా ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు. మొదటి మూడు రోజుల్లోనే 100 కోట్లు సాధించిన ఈ చిత్రం లాంగ్‌ రన్‌లో 200 కోట్లను సునాయాసంగా వసూళ్లు చేస్తుందనే నమ్మకంను ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు.

Jagapathibabu Dons Rustic Look In Aravinda Sametha

దసరా సెలవులు ఇంకా వారం రోజులున్న విషయం తెల్సిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా దుమ్ము దుమ్ముగా ఈ చిత్రం వసూళ్లు ఉన్నాయి. పెద్ద సినిమాలు ఏమీ కూడా పోటీకి లేవు. ఈనెల 18వ తారీకున ‘హలో గురూ ప్రేమకోసమే’ చిత్రం రాబోతుంది. ఆ సినిమా ఎలా ఉంటుందో అనే విషయంపై క్లారిటీ లేదు. కాని ఆ సినిమా ఫలితం కాస్త అటు ఇటుగా అయినా కూడా అరవింద సమేత వీర రాఘవుడికి అడ్డు అదుపు ఉండదనే టాక్‌ వినిపిస్తుంది. 200 కోట్ల క్లబ్‌లో చేరబోతున్న ఎన్టీఆర్‌ అంటూ అప్పుడే నందమూరి ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. ఫుల్‌ రన్‌లో కూడా నాన్‌ బాహుబలి రికార్డును దక్కించుకోవడం ఖాయం అంటూ ప్రచారం జరుగుతుంది. మొత్తానికి ఈదసరాతో ఎన్టీఆర్‌ చాలా కాలంగా ఎదురు చూస్తున్న రికార్డులను సొంతం చేసుకోబోతున్నాడు.

Jr NTR Aravinda Sametha Gets U/A Certificate