‘అరవింద…’ అరుదైన రికార్డు…!

Ntr Rare Feat With Aravinda Sametha Movie

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తాజా చిత్రం ‘అరవింద సమేత దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డుల మోత మోగిస్తోంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ చిత్రం అనుకున్నట్టుగానే కలెక్షన్ల వరద పారిస్తోంది. పండగ సందర్భంగా భారీ వసూళ్లు రాబట్టి ఆ తర్వాత కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లను కురిపిస్తోంది. ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ తెరకెక్కించగా రాదాకృష్ణ నిర్మించారు. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ప్యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. సీమ యాసతో ప్రేక్షకులను ‘అరవింద’ కట్టిపడేస్తోంది.

ntr-aravindha-sametha

ఈ చిత్రం విడుదలయిన 18 రోజులకు గాను 165 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది. వంద కోట్ల షేర్‌ మార్క్‌ను టచ్‌ చేసింది. ఎన్టీఆర్‌ కెరియర్‌ ఏ చిత్రం వసూలు చేయని విధంగా ‘అరవింద…’ వందకోట్ల షేర్‌ను దక్కించుకోవడంతో ఎన్టీఆర్‌ కెరియర్‌లో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఎన్టీఆర్‌ తొలి సారి వందకోట్ల షేర్‌ మార్క్‌ను టచ్‌ చేసినందుకు గాను అభిమానులు ఫుల్‌ ఖుషీగా ఫీలవుతున్నారు. మొత్తానికి భారీ అంచనాల నడుమ తెరకెక్కి విడుదలయిన ‘అరవింద సమేత’ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించడంతో చిత్ర యూనిట్‌ అంతా కూడా తెగ సంబరపడుతున్నారు.

ntr-movies