వీక్‌ డేస్‌లో కూడా కుమ్మేస్తోంది…!

Aravinda Sametha 5 Days Box Office Collections Report

‘అరవింద సమేత’ మొదటి నాలుగు రోజుల్లో 100 కోట్లను రాబట్టిన విషయం తెల్సిందే. అయిదు రోజుల్లోనే ఈ చిత్రం ఏకంగా 50 కోట్లకు పైగా షేర్‌ను రాబట్టినట్లుగా అధికారికంగా ప్రకటించారు. గురువారం విడుదలైన ఈ చిత్రం ఆదివారం వరకు సందడి చేసి, సోమవారంకు సైలెంట్‌ అవుతుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా వీకెండ్స్‌లో మాత్రమే కాకుండా వీక్‌ డేస్‌లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. నిన్న సోమవారం అన్ని ఏరియాల నుండి మంచి షేర్‌ వచ్చినట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.

Jr NTR Aravinda Sametha Gets U/A Certificate

తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవుల సందడి కొనసాగుతున్న కారణంగా ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతుంది. రేపు మరియు ఎల్లుండి పండగ ఉంది కనుక మరింత భారీగా వసూళ్లు ఉంటాయని చిత్ర యూనిట్‌ సభ్యులు ఆశిస్తున్నారు. మొత్తానికి ఈ చిత్రం రికార్డుల మోత మ్రోగించడం కంటిన్యూ చేస్తూనే ఉంది. ఎన్టీఆర్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. మొదటి రోజు షేర్‌లో తెలుగు రాష్ట్రాల్లో నాన్‌ బాహుబలి రికార్డును ఈ చిత్రం దక్కించుకున్న విషయం తెల్సిందే. లాంగ్‌ రన్‌లో ఈ చిత్రం నెం.3 స్థానంను చేరుతుందనే నమ్మకంతో నందమూరి అభిమానులున్నారు.

aravindha-sametha