అక్కడ అరవింద సమేత కూడా అంతంత మాత్రమే…!

Aravinda Sametha First Weekend US Box Office Report

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీగా వసూళ్లు చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటి వరకు ‘అరవింద సమేత’ చిత్రం 60 కోట్ల షేర్‌ను తెలుగు రాష్ట్రాల్లో దక్కించుకోవడంతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా తేలిపోయింది. ఇదే జోరు మరో మూడు నాలుగు రోజులు కొనసాగితే ఇండస్ట్రీ నాన్‌ బాహుబలి రికార్డును దక్కించుకోవడం ఖాయం అంటూ ప్రచారం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి తర్వాత స్థానంలో ఈ చిత్రం ఉంటుందనే విశ్వాసం వ్యక్తం అవుతుంది. అయితే ఈ చిత్రం అమెరికాలో మాత్రం చాలా నిరుత్సాహ పర్చుతుంది.

Aravinda Sametha 5 Days Box Office Collections Report

ఎన్టీఆర్‌ గతంలో చేసి సక్సెస్‌ అయిన సినిమాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయాన్ని దక్కించుకున్నా, ఓవర్సీస్‌లో మాత్రం మెప్పించడంలో విఫలం అయ్యాయి. ఎన్టీఆర్‌ సినిమాలు అక్కడ టాప్‌లోకి చేరలేక పోతున్నాడు. ఈమద్య వచ్చిన గీత గోవిందం చిత్రం స్థాయిలో కూడా అరవింద సమేత ఓవర్సీస్‌ కలెక్షన్స్‌ రావడం లేదు. మొదటి రోజే మిలియన్‌ డాలర్లను క్రాస్‌ చేయడంతో మూడు మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేస్తుందని అంతా ఆశించారు. కాని రెండు మిలియన్‌ల డాలర్లను వసూళ్లు చేసింది. మరో నాలుగు, అయిదు లక్షల డాలర్లను సినిమా రాబట్టే ఛాన్స్‌ ఉందని ప్రచారం జరుగుతుంది. కనుక మూడు మిలియన్‌ డాలర్లను ఈచిత్రం రాబట్టలేక పోతుంది. అంటే టాప్‌ 10లో ఈ చిత్రం నిలవడం అనుమానమే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

aravindha-sametha-puja-hudg