వివాదాస్పదం అవుతున్న కమల్‌ మద్దతు

దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న ఈ నేపథ్యంలో తమిళ ప్రముఖ రచయిత వైరముత్తుపై సింగర్‌ చిన్మయి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. పద్మ అవార్డు గ్రహీత అయిన వైరముత్తు అంతా అనుకునేలా మంచి వ్యక్తి కాదని, ఆయన ఒక కామపీశాచి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. చిన్మయి ఇవే వ్యాఖ్యలు మరెవ్వరిపై అయినా చేసి ఉంటే అంతా కూడా మూకుమ్మడిగా చిన్మయికి మద్దతు తెలిపేవారు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే వైరముత్తు ఒక గొప్ప రచయిత. ఆయన తమిళనాట రికార్డులు దక్కించుకున్న సినిమాలకు రచయితగా వర్క్‌ చేశాడు. అందుకే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఏ ఒక్కరు ముందుకు రావడం లేదు.

kamal hassan support with chinmayi

ఆయనకు వ్యతిరేకంగా ముందుకు రాకపోవడంతో పాటు, ఆయనకు మద్దతుగా కూడా ఎవరు నిలవడం లేదు. తాజాగా విశాల్‌ ఈ విషయమై స్పందిస్తూ వైరముత్తు గారిపై వచ్చిన ఆరోపణలను పరిశీలిస్తున్నాం. ఆయన తప్పు చేశాడని నిరూపితం అయితే తప్పకుండా చర్యలు తీసుకుంటాం, కాని ఇప్పటికప్పుడు ఆయన తప్పు చేశామని మాత్రం చెప్పడం కష్టం అన్నాడు. అదే విధంగా కమల్‌ కూడా వైరముత్తుకు తాజాగా మద్దతు పలికాడు. వైరముత్తు అలాంటి వ్యక్తి అయ్యి ఉండడు అని తాను భావిస్తున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఆయన మంచి వ్యక్తి అని, ఆడవారిని గౌరవించే సంస్కారం కలిగిన వ్యక్తి అంటూ కమల్‌ అన్నాడు. కమల్‌ చేసిన వ్యాఖ్యలపై కొందరు నెటిజన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒక మహిళ అంతగా బరితెగించి తనకు అన్యాయం జరిగిందని చెబుతుంటే కమల్‌ ఇలా మాట్లాడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.