‘హలో గురూ ప్రేమకోసమే’ ప్రివ్యూ…!

Hello Guru Prema Kosame Preview

‘నేను శైలజ’ చిత్రంతో ఒక మోస్తరు సక్సెస్‌ను దక్కించుకున్న రామ్‌ ఆ తర్వాత వచ్చిన ‘హైపర్‌’ మరియు ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రాలతో నిరాశ పర్చాడు. అంతకు ముందు కూడా రామ్‌కు ఆశించిన స్థాయిలో సక్సెస్‌లు దక్కినది లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఒక కమర్షియల్‌ హిట్‌ కావాలనే పట్టుదలతో రామ్‌ చేసిన చిత్రమే ‘హలో గురూ ప్రేమకోసమే’. యూత్‌ పల్స్‌ బాగా తెలిసిన దర్శకుడు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందిన విషయం తెల్సిందే. దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. యూత్‌లో మంచి అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ram

ఈ సంవత్సరంలో దిల్‌రాజుకు కూడా అంతగా కలిసి రావడం లేదు. గత ఏడాది వరుసగా డబుల్‌ హ్యాట్రిలను దక్కించుకున్న దిల్‌రాజు ఈ ఏడాది మాత్రం ‘లవర్‌’ మరియు ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రాలతో నష్టపోయాడు. ఈ చిత్రంతో లాభాలను ఆయన దక్కించుకుంటాడనే టాక్‌ వినిపిస్తుంది. తక్కువ బడ్జెట్‌తో ఈ చిత్రంను దిల్‌రాజు నిర్మించడం జరిగిందని సమాచారం అందుతుంది. సినిమాకు 25 కోట్ల బిజినెస్‌ జరగడంతో దిల్‌రాజు విడుదలకు ముందే అంతో ఇంతో లాభాలను అయితే తన ఖాతాలో వేసుకున్నాడు. మరి రేపు సినిమా విడుదలయ్యాక మరింతగా లాభాలను దిల్‌రాజు దక్కించుకుంటాడా, రామ్‌ ప్రస్తుత పరిస్థితుల్లో సక్సెస్‌ను దక్కించుకుంటాడా అనేది చూడాలి.

anupuma