టిల్లు స్క్వేర్: మూడు రోజుల్లోనే రికార్డు స్థాయి వసూళ్లు!

Tillu Square: Record collection in three days!
Tillu Square: Record collection in three days!

సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా దర్శకుడు మల్లిక్ రామ్ తరకెక్కించిన “టిల్లు స్క్వేర్” చిన్న మూవీ గా వచ్చి సంచలన విజయం సాధించింది. పైగా రోజురోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ పోతోంది . నిజానికి, ఒక వైపు ఐపీఎల్ మ్యాచ్‌లు ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ‘టిల్లు స్క్వేర్’ మాత్రం బలమైన పట్టుని చూపిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ.10.5 కోట్లని కలెక్ట్ చేయడం విశేషం.

Tillu Square: Record collection in three days!
Tillu Square: Record collection in three days!

ముఖ్యంగా నైజాంలో నిన్న “టిల్లు స్క్వేర్”కు రూ.3.3 కోట్ల షేర్ రావడం నిజంగా గొప్ప విషయమే. మొత్తమ్మీద “టిల్లు స్క్వేర్” మూవీ యూత్ తో పాటు సాధారణ ప్రేక్షకులని సైతం ఆకట్టుకుంటుంది. ఇక ఈ మూవీ లో నేహా శెట్టి క్యామియోలో కనిపించగా రామ్ మిర్యాల, అచ్చు సాంగ్స్ అందించగా భీమ్స్ సంగీతం అందించాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ 4 మూవీ స్ వారు నిర్మాణం వహించారు.