Election Updates: ఏపీలో టీడీపీ నేత ఇంటికి తెలంగాణ పోలీసులు..!

Election Updates: Telangana Police at TDP leader's house in AP..!
Election Updates: Telangana Police at TDP leader's house in AP..!

ఏపీలో టీడీపీ నేత శివానంద రెడ్డి ఇంటికి తెలంగాణ పోలీసులు వెళ్లారు. నందికొట్కూరు మండలం అల్లూరు లో టీడీపీ నేత, మాజీ ఐపిఎస్ శివానంద రెడ్డి ఇంటికి తెలంగాణ పోలీసులు వెళ్లారు. ఈ సందర్బంగా నోటీస్ ఇమ్మని కోరారట శివానంద రెడ్డి. తెలంగాణ పోలీసులు నోటీస్ తయారు చేస్తుండగానే వేగంగా కారు ఎక్కి వెళ్లిపోయారట శివానంద రెడ్డి.

ఇక టీడీపీ నేత, మాజీ ఐపిఎస్ శివానంద రెడ్డిను అడ్డుకునే ప్రయత్భం చేశారు తెలంగాణ హైదరాబాద్ పోలీసులు. కానీ దొరకకుండా తప్పించుకొని వెళ్లిపోయారు శివానంద రెడ్డి. హైదరాబాద్ లో భువివాదంలో అరెస్టు చేసేందుకు వచ్చారు సీసీఎస్ పోలీసులు. ఇక ఈ తరుణంలోనే.. పెద్ద ఎత్తున శివానందరెడ్డి ఇంటికి టీడీపీ శ్రేణులు చేరుకున్నాయి. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.