‘నోటా’ ఫైనల్ కలెక్షన్లు… పెద్ద ఫ్లాప్‌…!

Vijay Devarakonda NOTA Movie Area Wise Box Office Collections

‘అర్జున్‌ రెడ్డి’, ‘గీతాగోవిందం’ చిత్రాలతో విజయ్‌ దేవరకొండ యూత్‌లో క్రేజీగా మారిపోయాడు. విజయ్‌ సినిమాలకు కుర్రకారు చాలా ఉత్సహాన్ని చూపుతారు. విజయ్‌ నటించిన ‘నోటా’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలయ్యింది. విజయ్‌కు ఉన్న ఫేంతో ఓపెనింగ్స్‌ పర్వాలేదనిపించినా కూడా ఆ తర్వాత మిశ్రమ స్పందన వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలయిన ఈ చిత్రంలో ఎక్కువగా తమిళ ఫ్లేవర్‌ చూపించారు. దాంతో అటు తమిళంలో ఇటు తెలుగులో ఆకట్టుకోలేక రెండటికి చెడిన రేవడిలా మారింది. ప్రస్తుతం నోటా క్లోజింగ్‌ కలెక్షన్లు బయటకు వచ్చాయి. కేవలం 40శాతం మాత్రయే ‘నోటా’ వసూలు చేసింది. 55శాతం నష్టాలనే మిగిల్చింది.

nota-movie-poster-vijay

ఏరియా వారిగా ‘నోటా’ క్లోజింగ్‌ కలెక్షన్లు
నైజాం – 3.42 కోట్లు
సీడెడ్ – 1.05 కోట్లు
ఉత్తరాంధ్ర – 82 లక్షలు
ఈస్ట్ – 58 లక్షలు
వెస్ట్ – 37 లక్షలు
కృష్ణ – 53 లక్షలు
గుంటూరు – 60 లక్షలు
నెల్లూరు – 32 లక్షలు
టోటల్(ఏపీ + తెలంగాణా) – రూ. 7.69 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 83 లక్షలు
ఓవర్సీస్ – 1.30 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ – రూ.9.82 కోట్లు

nota-pics-new