‘యూటర్న్‌’ సెన్సార్‌ రిపోర్ట్‌

U Turn Telugu Movie Censor Report

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘యూటర్న్‌’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం తెలుగు మరియు తమిళంలో ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. సెన్సార్‌ బోర్డు ఈ చిత్రానికి ‘యూ/ఎ’ సర్టిఫికెట్‌ను జారీ చేయడం జరిగింది. పెద్దగా కట్స్‌ చెప్పకుండా చిత్రంకు సెన్సార్‌ బోర్డు సెన్సార్‌ను పూర్తి చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

U-Turn

‘యూటర్న్‌’ చిత్రంలో సమంత నటన చాలా బాగుందని, ఆమె నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు మొదటి నుండి చెబుతూ వస్తున్నారు. అన్నట్లుగానే సెన్సార్‌ బోర్డు వారు ఈ చిత్రంలో సమంత బాగా నటించింది అంటూ ప్రశంసలు కురిపించినట్లుగా సమాచారం అందుతుంది. సినిమాకు సంబంధించిన పలు సీన్స్‌ చాలా ఆసక్తికరంగా ఉన్నాయంటూ సెన్సార్‌ బోర్డు వారు కితాబిచ్చినట్లుగా చిత్ర నిర్మాతలు చెబుతున్నారు.

U-Turn-trailer

సెన్సార్‌ నుండి పాజిటివ్‌ టాక్‌ వచ్చిన కారణంగా సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింతగా పెరుగుతుంది. తెలుగు మరియు తమిళంలో ఈ చిత్రం సమంతకు భారీ ఎత్తున గుర్తింపు తెచ్చి పెడుతుందనే నమ్మకంను చిత్ర యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. సమంత ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. సమంత భర్త నాగచైతన్య ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రం కూడా అదే తేదీ అంటూ ఈనెల 13న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.