తాతల వయసులో కూడా అమ్మాయిల్ని ఎలా ?

sarath babu love affair with Namitha and Milind Soman affairs with Air hostess

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తలలు బోడులైనా తలపులు బోడులవునా… నెత్తి మీద వెంట్రుకలన్నీ ఊడిపోయేంత వయసు వచ్చినా మగవారిలో ఆ ఆలోచనలు యధావిధిగా వుంటాయని చెప్పేందుకు ఈ సామెత వాడుతుంటారు. అయితే తలపులు బోడులు కాకపోయినా 50 లు దాటాక ఏ ఆడపిల్ల అయినా మనల్ని చూసే అవకాశం లేదని మగ వాళ్ళు అనుకుంటుంటారు. అందుకే ఆ తర్వాత లోపల ఏమున్నా వయసుకు తగినట్టు అంటూ బయటకు మాత్రం పోకిరీ వేషాలు తగ్గించేస్తారు. కానీ మనసు గిలిగింతలని వయసుతో జోకొట్టే మహానుభావులకు ఇప్పుడు ఓ పెద్ద చిక్కు వచ్చి పడింది.

ఇటు కోలీవుడ్ లో ఓ జంట గురించి వినిపిస్తున్న ఓ రూమర్, అటు బాలీవుడ్ లో కళ్ళకి కనిపిస్తున్న ఓ నిజం ఇప్పుడు తాత వయసు మాగోళ్ళని కలవరపాటుకు గురి చేస్తోంది. కోలీవుడ్ లో వినిపిస్తున్న రూమర్ ప్రకారం 60 ఏళ్ళ వయసున్న శరత్ బాబు, తన కన్నా 24 ఏళ్ళు చిన్నదైన 36 సంవత్సారాల బ్యూటీ నమిత తో ప్రేమలో వున్నాడట. ఓ వారం రోజులుగా కోలీవుడ్ పత్రికలూ, సోషల్ మీడియాలో ఈ విషయం రచ్చ రచ్చ అవుతోంది. అయినా ఇటు శరత్ బాబు గానీ అటు నమిత కానీ ఈ విషయం మీద నోరు మెదపడం లేదు.

ఇక బాలీవుడ్ మ్యాటర్ మరీ బోల్డ్ గా వుంది. 51 మిలింద్ సోమన్, 18 ఏళ్ళ వయసున్న ఓ ఎయిర్ హోస్టెస్ తో సహజీవనం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పైన చెప్పుకున్న ఇద్దరు తాత వయసులోనూ ఇలా అమ్మాయిల్ని పడగొట్టడం ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ లో కూడా హాట్ టాపిక్ అయ్యిందట. టాలీవుడ్ లో తల బోడి అయిన ఓ హీరో సాయంత్రం మందు పార్టీలో ఇదే టాపిక్ మీద ఎడాపెడా డిస్కస్ చేసి చివరకు ఆ ఇద్దరు నుంచి టిప్స్ అడగాలని డిసైడ్ అయ్యాడంట. ఇంతకీ బయటికి వస్తున్న వార్తల్లో నిజం ఎంతో ? ఆ విషయం తెలుసుకోకుండా టిప్స్ అడిగితే అసలే చిరాకుతో వుండే వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో ఏమో ?