సస్పెన్స్‌ను కొనసాగిస్తున్న రాజమౌళి

rajamouli-continuing-suspense-on-his-next-film

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌ జక్కన్న ‘బాహుబలి 2’ చిత్రం విడుదలై అర్ధ సంవత్సరం దాటబోతుంది. అయినా ఇప్పటి వరకు తన తర్వాత సినిమాపై జక్కన్న క్లారిటీ ఇవ్వలేదు. ‘బాహుబలి’ కోసం దాదాపు అయిదు సంవత్సరాలు కేటాయించిన జక్కన్న తన తర్వాత సినిమాకు కాస్త గ్యాప్‌ తీసుకుంటాను అంటూ ముందే చెప్పాడు. ఆ గ్యాప్‌ రెండు లేదా మూడు నెలలు ఉంటుందని అంతా భావించారు. కాని ఆరు నెలలు అవుతున్నా కూడా ఇప్పటికి జక్కన్న సినిమా మొదలు పెట్టింది లేదు. గతంలో పలు సార్లు తన తర్వాత సినిమా గురించి పొడి పొడిగా స్పందించిన రాజమౌళి మరోసారి అదే విధంగా స్పష్టత ఇవ్వకుండా తన తర్వాత సినిమా గురించి ఒక ప్రకటన చేశాడు.

రాజమౌళి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తర్వాత సినిమా పౌరాణికం కాదని, ఒక సోషల్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుందని చెప్పుకొచ్చాడు. అయితే తన తర్వాత సినిమాను డివివి దానయ్య నిర్మాణంలో చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. ఇప్పటి వరకు కథ ఏంటీ, హీరో ఎవరు అనే విషయంపై క్లారిటీకి రాలేదు అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు. అయితే మరో వైపు మాత్రం రాజమౌళి దర్శకత్వంలో దానయ్య నిర్మించబోయే సినిమాలో మహేష్‌బాబు హీరోగా నటించనున్నట్లుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. మహేష్‌ లేదా చరణ్‌ హీరోగా జక్కన్న సినిమా ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఆ విషయాన్ని మాత్రం జక్కన్న అధికారిక క్లారిటీతో చెప్పలేదు.

రాజమౌళి సినిమా ప్రకటన కోసం ఆయన ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘బాహుబలి’ సినిమాతో టాలీవుడ్‌ స్థాయిని హాలీవుడ్‌కు తీసుకు వెళ్లిన జక్కన్న తర్వాత సినిమా మరెంత సంచలనం సృష్టిస్తాడో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జక్కన్న తర్వాత చేయబోతున్న సినిమా ఖచ్చితంగా తెలుగుతో పాటు తమిళం మరియు హిందీలో కూడా రూపొందే అవకాశం ఉంది. జక్కన్న ఈ సస్పెన్స్‌ను ఎప్పుడు ఫుల్‌స్టాప్‌ పెడతాడో చూడాలి. 2019లో జక్కన్న సినిమా మొదలవుతుందని ఇటీవలే ఆయన సన్నిహితుడు ఒకరు ప్రకటించారు. ఆ విషయంపై కూడా జక్కన్న క్లారిటీ ఇవ్వలేదు.