కన్ఫర్మ్‌ : నవదీప్‌ డ్రగ్స్‌ తీసుకున్నాడు..

Navdeep Refuses To Give Samples To SIT Officials

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

డ్రగ్స్‌ కేసులో తీగ లాగితే డొంక అంతా కదిలినట్లుగా ఉంది పరిస్థితి. ఎక్కడో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న వారిని పట్టుకుంటే వారి వద్ద సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖుల నెంబర్‌లు లభ్యం కావడం సంచలనంకు తెర లేపింది. అయితే సినిమా సెలబ్రెటీలను ఈ కేసులోకి లాగడంను కొందరు తప్పుబట్టారు. కాని సిట్‌ అధికారులు మాత్రం సాక్ష్యాధారాలు పక్కాగ ఉన్న నేపథ్యంలోనే తాము సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేశాం, వారిని విచారిస్తున్నాం అంటున్నారు. విచారణలో సంచలన నిజాలు వెళ్లడవుతున్నాయని కూడా వారు చెప్పుకొచ్చారు. ఇక సిట్‌ అధికారులు విచారణకు హాజరు అయిన ప్రతి ఒక్కరి శాంపిల్స్‌ను కూడా తీసుకుంటున్నారు. వారు డ్రగ్స్‌ తీసుకున్నారా లేదా అనే విషయాలు తెలుసుకునేందుకు శాంపిల్స్‌ను టెస్ట్‌ చేయనున్నారు.

తాజాగా సిట్‌ ముందు హీరో నవదీప్‌ విచారణకు హాజరు అయిన విషయం తెల్సిందే. సిట్‌ అధికారుల ముందు నవదీప్‌ పలు ఆసక్తికర విషయాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలోనే తాను డ్రగ్స్‌ తీసుకోను అని చెప్పాడట. అయితే డ్రగ్స్‌ టెస్ట్‌కు మాత్రం నో చెప్పాడట. రక్తం, జట్టు, గోర్లు శాంపిల్స్‌ ఇచ్చేందుకు నో చెప్పాడు. బలవంతంగా తీసుకునే అధికారం లేకపోవడంతో సిట్‌ అధికారులు ఏం చేయలేక పోయారు. అయితే విచారణ మాత్రం నవదీప్‌ విషయంలో మరింత లోతుగా చేయాలని భావిస్తున్నారు. శాంపిల్స్‌ ఇచ్చేందుకు నిరాకరించడంతో నవదీప్‌ ఖచ్చితంగా డ్రగ్స్‌ తీసుకుంటున్నాడు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్‌ తీసుకోవడంతో పాటు కొంతమంది సినీ ప్రముఖులకు కూడా నవదీప్‌ డ్రగ్స్‌ను సరఫరా చేసేవాడు అనేది సిట్‌ చేస్తున్న ఆరోపణ. వారి వద్ద సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. త్వరలో నవదీప్‌ను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు:

ఛార్మి, ముమైత్‌లకు ప్రత్యేక ఏర్పాట్లు

వర్మ కూడా డ్రగ్స్‌ కేసులో..!

ధనుష్‌కు కోపం వచ్చింది