క‌న్నీరు పెట్టిస్తున్న చిన్నారి వీడియో

Limb Children's Playing In A Park Video Viral On Social Media.

Posted September 12, 2017 at 17:35 

ఇద్ద‌రు చిన్నారులు ఓ పార్క్ లో జారుడు బ‌ల్ల‌పై ఆడుకుంటున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇద్ద‌రు చిన్నారులు ఆడుకోవ‌టం అన్న‌ది మామూలు విష‌య‌మే అయినా ఆ వీడియో వైర‌ల్ కావ‌టానికి కార‌ణం అందులో ఓ చిన్నారికి కాళ్లూచేతులూ లేక‌పోవ‌టం. వీడియోలో ఓ చిన్నారి వేగంగా మెట్లు ఎక్కుతూ జారుడు బ‌ల‌పై చేరుకుని అక్క‌డినుంచి జారుతూ ఆడుకుంటోంది. మ‌రో చిన్నారి ఎలాగైనా మెట్లు ఎక్కి జారుడు బ‌ల్ల‌పైకి వెళ్లాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతోంది. చివ‌ర‌కు ఆ పాప త‌న ప్ర‌య‌త్నంలో విజ‌యం సాధించింది. వీడియో లో బ్యాక్ గ్రౌండ్ లో ఓ గొంతు ఎంక‌రేజ్ చేస్తుండ‌గా ఆ చిన్నారి న‌వ్వుతూనే ఒక్కో మెట్టు ఎక్కి పైకిచేరింది. అక్క‌డినుంచి జారుడు బ‌ల్ల‌పై జారుతూ కింద‌కి రాగానే సంతోషంతో పెద్ద‌గా న‌వ్వింది. ఇప్పుడీ వీడియో ఎంద‌రికో ల‌క్ష్య‌సాధ‌న దిశ‌గా స్ఫూర్తినిస్తోంది. పాప ప్ర‌య‌త్నాన్ని అభినందిస్తూనే …..చాలా మంది ఈ వీడియోను చూసి క‌న్నీరు పెట్టుకుంటున్నారు. సెల‌బ్రిటీలు అయితే ఈ వీడియో విప‌రీతంగా షేర్ చేస్తున్నారు. టెక్ దిగ్గ‌జం, మ‌హీంద్రా ఎగ్జిక్యూటివ్ ఛైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్రా ఈ వీడియోను చూస్తూ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ఇంత ఉద్వేగ‌భ‌రిత‌మైన వీడియోను చూడ‌లేక‌పోయాన‌ని…కానీ దీన్ని చూసిన త‌రువాత ప్రపంచంలో ఏ ప‌ని కూడా క‌ష్ట‌మైన‌ది కాద‌ని భావిస్తున్నాన‌ని ఆయ‌న ట్వీట్ చేశారు.

మరిన్ని వార్తలు:

ఈ ఏడు సూత్రాలు పాటిస్తే ఆనందం మీ సొంతం.

వైసీపీ ని భయపెట్టిన ఉండవల్లి?

SHARE