మహానుభావుడుకి సాహో సపోర్ట్‌

Prabhas,Attend Audio Launch , Mahanubhavudu, Chief Guest,Sharwanand ,Mahanubhavudu teaser, Maruthi Mahanubhavudu,Maruthi Mahanubhavudu,Mahanubhavudu Telugu Movie ,Official Teaser ,Review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

శర్వానంద్‌ హీరోగా మెహ్రీన్‌ హీరోయిన్‌గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహానుభావుడు’. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దసరాకు ఎన్టీఆర్‌ ‘జై లవకుశ’ మరియు మహేష్‌బాబు ‘స్పైడర్‌’ చిత్రాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి. ఈ సమయంలో వారిద్దరి పోటీని తట్టుకుని నిలబడాలి అంటే ప్రమోషన్‌ కాస్త గట్టిగా ఉండాలి. అందుకే స్టార్‌ హీరో ప్రభాస్‌ను రంగంలోకి దించాలని నిర్ణయించారు. ప్రభాస్‌ సన్నిహితులు అయిన యూవీ క్రియేషన్స్‌ నిర్మాతలు వంశీ మరియు ప్రమోద్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం వారి నిర్మాణంలోనే ‘సాహో’ సినిమాను ప్రభాస్‌ చేస్తున్నాడు. ఆ కారణంగానే ‘మహానుభావుడు’ సినిమా ప్రమోషన్‌లో ప్రభాస్‌ పార్టిసిపెంట్‌ చేయబోతున్నాడు. సదరు సినిమాకు తన బెస్ట్‌ విషెష్‌ చెప్పడంతో పాటు, సినిమా చూడాల్సిందిగా తన అభిమానులకు పిలుపునివ్వబోతున్నాడు. భారీ స్థాయిలో అంచనాలున్న ‘మహానుభావుడు’ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ సినిమా స్థాయిని అమాంతం పెంచింది.

మరిన్ని వార్తలు:

ఎన్టీఆర్‌ను చూసి లక్ష్మీ ప్రణతి భయపడిన సందర్బం

మహేష్‌తో ఎన్టీఆర్‌ ఢీ.. నిలిచేనా?