ఎన్టీఆర్‌ను చూసి లక్ష్మీ ప్రణతి భయపడిన సందర్బం

Junior Ntr Wife lakshmi pranathi fied with jai character

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎన్టీఆర్‌ ఎలాంటి పాత్రను అయినా అవలీలగా చేసేస్తాడు అంటూ రాఖి, టెంపర్‌, జనతాగ్యారేజ్‌ వంటి చిత్రాల తర్వాత తేలిపోయింది. ఇప్పటి వరకు హీరోగా మాత్రమే కనిపించిన ఎన్టీఆర్‌ మొదటి సారి ‘జై లవకుశ’ చిత్రంలో విలన్‌గా కనిపించబోతున్నాడు. జై రావణ అనే పాత్రలో తనలోని నటన విశ్వరూపంను ఎన్టీఆర్‌ చూపించేందుకు సిద్దం అయ్యాడు. ఈనెల 21న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తాజాగా ప్రీ రిలీజ్‌ వేడుక సందర్బంగా కళ్యాణ్‌ రామ్‌ మాట్లాడిన మాటలు ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ఏ స్థాయిలో నటించాడో చెప్పకనే చెబుతున్నాయి.

జై లవకుశ సినిమాలో మూడు పాత్రల్లో జై రావణ పాత్ర కోసం ఎన్టీఆర్‌ ఎక్కువ కష్టపడ్డట్లుగా కళ్యాణ్‌ రామ్‌ చెప్పుకొచ్చాడు. ఆ పాత్రకు సంబంధించిన సీన్స్‌ చిత్రీకరణ ఆపై రషెష్‌ చూసిన సందర్బంలో కొన్ని సార్లు ఎన్టీఆర్‌ భార్య లక్ష్మీ ప్రణతి కూడా భయపడ్డట్లుగా చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్‌ ఎంత భయంకరంగా నటించాడో లక్ష్మి ప్రణతి భయాన్ని బట్టి చెప్పుకోవచ్చు. సినిమాలో మూడు పాత్రలు కూడా వేటికి అవి విభిన్నంగా ఉండి ప్రేక్షకులను అలరిస్తాయనే నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు. ఎన్టీఆర్‌ తప్ప ఈ సినిమాను ఇంత గొప్పగా ఎవరు చేయలేరు అంటూ నేను గంటా పథంగా చెబుతున్నాను అని కళ్యాణ్‌ రామ్‌ అన్న మాటలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి.

మరిన్ని వార్తలు:

అమెరికాను వ‌ణికిస్తున్న ఇర్మా

ఆ గొడవలతో కాంగ్రెస్ కి మీడియా దొరికింది.

ఈ నెల 22నుంచి శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాలు