బాబోయ్‌.. ఏంటి ఈ కాంబినేషన్‌?

BalaKrishna Crazy Combination with director Harish Shankar

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నందమూరి బాలకృష్ణకు అంటూ ఒక ఇమేజ్‌ ఉంది. మాస్‌లో ఆయనకు భారీ ఫాలోయింగ్‌ ఉంది. అయితే మాస్‌ దర్శకుడే అయినప్పటికి పూరి జగన్నాధ్‌కు బాలకృష్ణను డైరెక్ట్‌ చేసే సత్తా లేదని కొందరు భావించారు. బాలయ్యను హ్యాండిల్‌ చేయగల సామర్థ్యం పూరికి లేదని, బాలయ్య అనవసరంగా పూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడని అభిమానులు, ప్రేక్షకులు, సినీ వర్గాల వారు అంతా అనుకున్నారు. కాని బాలయ్యతో ‘పైసావసూల్‌’ సినిమా తెరకెక్కించి విమర్శకుల నోరు మూయించాడు పూరి. బాలయ్య కూడా తన నిర్ణయం తప్పు కాదని నిరూపించుకున్నాడు. ఇప్పుడు తాజాగా మరోసారి వింత కాంబినేషన్‌ గురించి చర్చలు జరుగుతున్నాయి.

‘గబ్బర్‌సింగ్‌’ వంటి బ్లాక్‌ బస్టర్‌ను, ‘రామయ్యా వస్తావయ్యా’ అంటూ డిజాస్టర్‌ చిత్రాలను తెరకెక్కించిన హరీష్‌ శంకర్‌ ఇటీవల ‘డీజే’ వంటి మంచి కమర్షియల్‌ సినిమాను కూడా తెరకెక్కించాడు. హరీష్‌ శంకర్‌ యూత్‌ ఫుల్‌ సినిమాలు తీయడంలో అందె వేసిన చేయి. కాని తాజాగా ఈయన బాలయ్యకు కథ చెప్పడం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది. ఒక మంచి మాస్‌ మసాలా కథను బాలయ్యకు చెప్పినట్లుగా స్వయంగా హరీష్‌ శంకర్‌ చెబుతున్నాడు. బాలయ్య సానుకూలంగా స్పందించినట్లుగా కూడా ఆయన అంటున్నాడు. ప్రస్తుతం ‘దాగుడుమూతలు’ పనిలో ఉన్న హరీష్‌ శంకర్‌ ఆ తర్వాత బాలయ్యతో సినిమా చేసే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.

మరిన్ని వార్తలు:

‘జై లవకుశ’ ట్రైలర్…ఎన్టీఆర్ నట విశ్వరూపం

ఎందుకు అదే అడుగుతున్నారు?