గురువుకి షాక్ ఇచ్చిన శిష్యుడు…

i-support-pawan-kalyan-says-puri-jagannadh

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

పవన్‌ కళ్యాణ్‌పై శ్రీరెడ్డి వ్యాఖ్యల వెనుక తాను ఉన్నట్లుగా స్వయంగా చెప్పిన రామ్‌ గోపాల్‌ వర్మపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు వర్మను అభిమానించి, ఆయన ధైర్యం, దమ్మును మెచ్చుకున్న వారు కూడా ప్రస్తుతం ఆయన్ను తీవ్ర పదజాలంతో విమర్శిస్తున్నారు. తాజాగా రామ్‌ గోపాల్‌ వర్మకు అత్యంత ఆప్తుడు అయిన దర్శకుడు పూరి జగన్నాధ్‌ కూడా విమర్శలు వ్యక్తం చేశాడు. వర్మ ఎప్పుడు హైదరాబాద్‌ వచ్చినా కూడా పూరితో కలవడం, పూరి చేసిన సినిమాలపై వర్మ ఎప్పటికప్పుడు తన స్పందన తెలియజేస్తూ ఉంటాడు. అలాంటి వర్మపై పూరి విమర్శలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.

ట్విట్టర్‌లో పూరి.. నాకు జీవితాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బాధపడటం నాకు చాలా బాధ కలిగించింది . అతనిని ఎప్పుడూ ఇలా చూడలేదు . Rgv చేసిన పని నాకు నచ్చలేదు . ప్రాణం ఉన్నంత వరకూ I support Pawan kalyan . అంటూ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతుంది. ఈ ట్వీట్‌పై రామ్‌ గోపాల్‌ వర్మ కూడా స్పందించాడు. తాను చేసింది తప్పే అని, అయితే తాను ఇప్పటికే క్షమాపణలు చెప్పాను అంటూ వర్మ ట్వీట్‌ చేయడం జరిగింది. వర్మ ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పినా కూడా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్‌ మాత్రం కూల్‌ అవ్వడం లేదు. ఈ విషయమై వర్మపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ వారు డిమాండ్‌ చేస్తున్నారు.