పూరి, రామ్‌.. ఏదో జరుగుతోంది…!

Ram Surprising And Costly Gift To Puri Jagannath

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన ‘హలో గురూ ప్రేమకోసమే’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం సక్సెస్‌ కోసం డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా టాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే హలో గురూ సక్సెస్‌ అయితే రామ్‌ ఈయనతో ఒక చిత్రాన్ని చేసేందుకు ఓకే చెప్పాడట. ప్రస్తుతం దర్శకుడు పూరి పరిస్థితి దారుణంగా ఉంది. స్టార్‌ హీరోలు కాదు కదా, కనీసం చిన్న హీరోలు కూడా పూరితో సినిమా చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దాంతో రామ్‌తో సినిమాకు విపరీతంగా ప్రయత్నం చేస్తున్నాడు.

puri-jaganath

ఇప్పటికే రెండు మూడు కథలను రామ్‌కు వినిపించిన పూరి అతడి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాడట. రామ్‌ మాత్రం ‘హలో గురూ ప్రేమకోసమే’ హిట్‌ అయితేనే పూరితో సినిమా చేయాలని భావిస్తున్నాడు. రెండు మూడేళ్లుగా సక్సెస్‌ అనేది లేకుండా సినిమాలు చేస్తున్న పూరి దర్శకత్వంలో నటించడం అంటే పెద్ద సాహసమే అని చెప్పాలి. అందుకే ఆ సాహస నిర్ణయం ఒక సినిమా హిట్‌ అయినప్పుడు తీసుకుంటే పర్వాలేదు, ఫ్లాప్‌ పడ్డా కూడా సాహస నిర్ణయం తీసుకుంటే అంతకు మించిన వెర్రితనం ఏమీ ఉండదనేది రామ్‌ అభిప్రాయంగా తెలుస్తోంది. హలో గురూ ఏమాత్రం హిట్‌ టాక్‌ను దక్కించుకున్నా పూరికి ఒక ఛాన్స్‌ దక్కినట్లే అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. మరికొన్ని గంటల్లో సినిమా ఫలితం వచ్చేయనున్న నేపథ్యంలో ఏం జరుగుతుందా అంటూ అంతా ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్నారు.

hello-guru-prema-kosame