పిక్‌ టాక్‌ : దసరాకు బసవతారకం వచ్చేశారు…!

Vidya Balan Will Do A Special Role In Ajith Tamil Remake Of Pink Movie

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ వచ్చే ఏడాది జనవరిలో రెండు పార్ట్‌లుగా రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ నటిస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్‌గా బాలయ్య లుక్‌ రివీల్‌ అయ్యింది. పలు గెటప్స్‌లో ఎన్టీఆర్‌ లుక్‌ను దర్శకుడు క్రిష్‌ రివీల్‌ చేశాడు. తాజాగా ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకంగా నటిస్తున్న విద్యాబాలన్‌ లుక్‌ను రివీల్‌ చేశారు. ఇప్పటి వరకు విద్యాబాలన్‌ లుక్‌ను విడుదల చేయని చిత్ర యూనిట్‌ సభ్యులు అనఫిషియల్‌గా దసరా కానుకగా ఈ ఫొటోను లీక్‌ చేసినట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ntr-movies

ఎన్టీఆర్‌ సతీమణి గురించి జనాలకు ఎక్కువగా తెలియదు. కాని ఈ చిత్రంలో ఆమె గురించి ఎక్కువగా చూపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. సినిమా రెండు పార్ట్‌ల కథ కూడా ఆమె చుట్టు తిరిగేలా దర్శకుడు క్రిష్‌ ప్లాన్‌ చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఇక ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడు పాత్రను రానా, ఏయన్నార్‌ పాత్రను సుమంత్‌, శ్రీదేవి పాత్రను రకుల్‌ పోషిస్తున్నారు. రెండు పార్ట్‌లపై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

ntr-biopic