సాయిపల్లవి అంటే ఇంతే మరీ…!

Director Harish Shankar Plans For Multistatter Movie

దర్శకుడు హరీష్‌ శంకర్‌ అనిల్‌ సుంకరతో ఒక చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నాడు. ‘దాగుడు మూతు’ మల్టీస్టారర్‌ను ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఇదివరకు దిల్‌రాజుతో కలిసి తెరకెక్కించాలని దర్శకుడు హరీష్‌ శంకర్‌ భావించాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రానికి బ్రేక్‌ పడిరది. దిల్‌రాజుతో చర్చలు జరిపినపుడు ఈ చిత్రంలో ఇద్దరు క్రేజీ హీరోతో పాటు ఒక హీరోయిన్‌గా సాయిపల్లవిని ఎంపిక చేయాలనుకున్నారు. కానీ దిల్‌రాజుతో తెగతెంపుల తర్వాత హీరోలు ఎవరు అనేది ఇంకా క్లారిటీ లేదు. ఒక హీరోయిన్‌గా మాత్రం సాయిపల్లవిని ఎంపిక చేయానుకున్నారు.

director-harish

హరీష్‌ శంకర్‌ తాజాగా పూర్తి కథతో సాయి పల్లవిని సంద్రించాడట. అయితే ఇద్దరు హీరోయిన్లు మరియు తన పాత్ర ప్రాధాన్యత దృష్ట్యా ఈ అమ్మడు హరీష్‌ శంకర్‌కు నో చెప్పింది. పాత్ర నచ్చకపోవడంతో సాయి పల్లవి, ఏ బ్యానర్‌, పారితోషికం ఎంత అనేది ఆలోచించకుండా నో చెప్పింది. ఇప్పటి వరకు ఈ అమ్మడికి యూత్‌లో మంచి క్రేజ్‌ ఉంది. దాంతో తనకు నచ్చిన పాత్రల్లోనే చెస్తాను తప్పితే పారితోషికం వస్తుందని ఏది పడితే అది చేయను అంటూ సన్నిహితుల దగ్గర ఎప్పుడు చెబుతూనే ఉంటుందట. సాయిపల్లవి నో చెప్పడంతో హరీష్‌ శంకర్‌ కథలో పలు మార్పులు చేసి మళ్లీ సంద్రించాలని భావిస్తున్నాడు. కథ మార్చితే అయినా సాయి పల్లవి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందనేది సందేహమే. మొత్తానికి సాయి పల్లవి అంటే ఇంతే అని మరోసారి నిరూపించుకుంది.

sai-pallavi-movies