త్రివిక్రమ్‌ ఆమెను నిండా ముంచాడు…?

Aravindha Sametha Movie Second Heroine Eesha Rebba

త్రివిక్రమ్‌ చిత్రాలు అనగానే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా అంచనాలు ఓ స్థాయిలో ఉంటాయి. ఇక ఈయన చిత్రంలో అవకాశం వస్తే వెనుక ముందు ఆలోచించకుండా వెంటనే ఒకే చెబుతారు. అయితే ఇలా చేసిన వారందరికి కూడా పూర్తి న్యాయం జరుగుతుందనేది ఏమి లేదు. త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ చిత్రంలో అవకాశం రాగానే తెలుగు హీరోయిన్‌ ఈషా రెబ్బా వెంటనే ఒకే చేసింది. సెకండ్‌ హీరోయిన్‌ అనగానే ఈ అమ్మడు ఏమి లోచించకుండా ఒకే చెప్పింది. తీరా చూస్తే ఈ చిత్రంలో ఈషాకు ఊహించిన స్థాయిలో పాత్ర లేదు. ఈ చిత్రం ద్వారా తనకు ఒరిగింది ఏమీ లేదు, దీనివ్ల పలు చిత్రాలను కూడా వదులుకోవాల్సి వచ్చింది అంటూ ఈషా సన్నిహితుల దగ్గర తన గోడును వెల్లబోసుకుంటుంది.

Eesha-Rebba

‘అరవింద సమేత’ చిత్రంలోనే ఈషాపై తీసిన షాట్స్‌ కూడా ఇరికించినట్టుగా ఉన్నాయి తప్ప పెద్దగా స్కోప్‌ ఏమి లేదు, పేరుకు సెకండ్‌ హీరోయిన్‌ కానీ ఒక్క పాట కూడా లేదు, కేవలం ‘పెనివిటి’ సాంగ్‌లో రెండు షాట్లలో చూపించారు. పేరుకు పెద్ద చిత్రం కానీ నాకు ఊహించిన స్థాయిలో పాత్ర ఇవ్వలేదు, సెకండ్‌ హీరోయిన్‌ అని చెప్పి నన్ను మోసం చేశారు అంటూ ఈషా ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇకపై పెద్ద చిత్రాల ఆఫర్‌ వస్తే పాత్ర నిడివి, పాత్ర ప్రాధాన్యత చూశాకే ఒకే చెప్పాలి అని అంటోంది. ‘అరవింద..’ పై ఎంతగానో ఆశాలు పెట్టుకున్న ఈషాను త్రివిక్రమ్‌ నిండా ముంచేశాడు.

Aravindha Aametha Movie Second Heroine Eesha Rebba