Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాల నటుడిగా ఎన్నో చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న పూరి ఆకాష్ తాజాగా ‘మెహబూబా’ చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ తన మనసులోని బాధను చెప్పుకొచ్చాడు. ‘మెహబూబా’ చిత్రానికి తన తండ్రి నిర్మాత అవ్వడం వల్ల ఆయన తనకు పారితోషికం ఇవ్వలేదని, ఒక హీరోగా పారితోషికం తీసుకోవాలనే కోరిక ఉంటుందని, కాని తనకు ఆ అవకాశం దక్కలేదు అంటూ పేర్కొన్నాడు. తన తండ్రి పారితోషికం ఇస్తే తప్పకుండా తీసుకుంటాను అంటూ మీడియాతో సరదాగా వ్యాఖ్యనించాడు.
ఆకాష్ రెండవ చిత్రం కూడా పూరి దర్శకత్వంలోనే ఉండబోతుంది. ఆ కారణంగా పూరికి రెండవ సినిమా ద్వారా కూడా పారితోషికం వచ్చే అవకాశం లేదు. మొదటి సినిమా సక్సెస్ అయితే రెండవ సినిమా వెంటనే ప్రారంభించాలని ఇప్పటికే పూరి భావించాడు. అయితే ఆకాష్ రెండవ సినిమాను మరో నిర్మాతతో కలిసి నిర్మించానేది పూరి ప్లాన్‌గా తెలుస్తోంది. అప్పుడైనా ఆకాష్‌కు పారితోషికం దక్కేనో చూడాలి. ఆకాష్ ఎన్నో చిత్రాలతో బాల నటుడిగా మెప్పించాడు. అయితే హీరోగా మాత్రం అప్పుడే మెప్పిస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా ఉంది. పూరి ఆకాష్ ఒక పక్కా కమర్షియల్ హీరోగా ఎదుగుతాడని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. పూరి కూడా తన కొడుకును కమర్షియల్ హీరోగా నిలబెట్టేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.