ఒప్పుకున్న దర్శకేంద్రుడు

Raghavendra Rao to direct NTR Biopic movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోతున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. ఈ చిత్రంకు తేజ దర్శకత్వం వహించాల్సి ఉండగా తాను ఈ ప్రాజెక్ట్‌కు న్యాయం చేయలేను అంటూ తేల్చి చెప్పి పక్కకు తప్పుకున్నాడు. అయితే ఇన్‌సైడ్‌ టాక్‌ ఏంటీ అంటే కావాలని తేజను బాలయ్య తప్పించాడని, స్వయంగా ఈ చిత్రాన్ని తానే తెరకెక్కించాలనేది ఆయన ప్లాన్‌ అని తెలుస్తోంది. దర్శకుడిగా తనకు పెద్దగా అనుభవం లేని కారణంగా క్రిష్‌ మరియు రాఘవేంద్ర రావుల సలహాలు సూచనలు తీసుకోవాలని కూడా ఈయన నిర్ణయించుకున్నాడు.

ప్రస్తుతం బాలీవుడ్‌లో మణికర్ణిక అనే చిత్రాన్ని చేస్తున్న క్రిష్‌ ఈ ప్రాజెక్ట్‌కు హెల్ప్‌ చేయలేను అంటూ తేల్చి చెప్పాడు. అయితే రాఘవేంద్ర రావు మాత్రం బాలయ్యకు మద్దతుగా నిలిచేందుకు సిద్దం అయ్యాడు. స్క్రిప్ట్‌ వర్క్‌తో పాటు, షూటింగ్‌ సమయంలో, స్క్రీన్‌ప్లేకు అన్ని విధాలుగా సాయం చేస్తాను అంటూ బాలయ్యకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. టీటీడీలో రాఘవేంద్ర రావు కీలక పదవిలో ఉన్నాడు. ఆ పదవికి కారణం బాలకృష్ణ. అందుకే రాఘవేంద్ర రావు ‘ఎన్టీఆర్‌’ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ చేసేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.